ఆ తర్వాత ‘రైడ్’, ఇంకొన్ని సినిమాలు చేసింది కానీ ఆశించినట్టు హిట్స్ మాత్రం రాలేదు. సరైన ప్లానింగ్ లేకపోవడం, వచ్చిన ఆఫర్స్ అన్ని ఒప్పుకోవడంతో కెరీర్ ఒక్కసారిగా డీలాపడిపోయింది. ఆఖరికి శ్రీహరి పక్కన కూడా హీరోయిన్ గా నటించింది.
సినిమా ఆఫర్లు తగ్గడంతో కనీసం కుటుంబం గడవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులను ఎదుర్కొంది. అలాగే కొనసాగితే కెరియర్ ముగిసిపోతుందని భావించి కుటుంబ పోషణ కోసం వ్యభిచారము నిర్వహిస్తూ పోలీసులకు చిక్కింది.
పోలీసులకు చిక్కిన రోజున తనతో పాటూ టాలీవుడ్ సినీ పరిశ్రమ కి చెందిన ఓ సీనియర్ నటి కూడా ఉందట. కానీ అప్పటికే ఆ సీనియర్ నటికి ఇండస్ట్రీ లో మరియు రాజకీయాలలో పలువురు ప్రముఖ వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు అలాగే పరిచయాలు ఉండటంతో తన పేరు బయటికి రాకుండా గుట్టు చప్పుడు కాకుండా తప్పించుకుందని ఒక న్యూస్ వచ్చింది.
కొన్నాళ్ల తర్వాత బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసి దర్శకుడు రోహిత్ మిట్టల్‌ను పెళ్లి చేసుకుంది. అంతా సవ్యంగా సాగుతుంది అనుకుంటున్న సమయంలోనే విడాకులు తీసుకుంది. ఇప్పుడు సినిమాలకు కూడా దూరం గా ఉంది.