Swetha Basu Prasad : ‘సినిమా అంటే రంగుల ప్రపంచం. అందులో చీకటి రంగు కూడా వుంటుంది. చీకటి మనుషుల వల్లే సినిమాకి అపప్రథ వస్తోంది.. ‘ అంటూ నటి శ్వేతా బసు ప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వాపోయింది. అంతలా శ్వేతా బసు రియాక్ట్ కావడానికి కారణమేమై వుంటుంది చెప్మా.!
ఇంతకీ శ్వేతా బసు ప్రసాద్ గుర్తుంది కదా. ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమా సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా ఛాన్సులు అందుకుంది కూడా. బ్రైట్ ప్యూచర్ వున్న ముద్దుగుమ్మ. కాస్త బొద్దుగా మారి వచ్చి అవకాశాల్నే చేజార్చుకుందనుకోండి.
అన్నింటికీ మించి అనుకోకుండా ఓ వివాదాస్పద కేసులో ఇరుక్కుని పోలీసులకు చిక్కింది. కేసు సీరియస్ అవ్వడంతో అరెస్టయ్యింది కూడా. ఎలాగోలా తప్పించుకుని బయటికి వచ్చింది కానీ, కెరీర్ మొత్తం నాశనమైపోయింది. తెలుగు తెరకు పూర్తిగా దూరమైపోయింది కొన్నాళ్లు.
అయితే, అంత జరిగినా ఓ తెలుగు హీరో తనకు ఛాన్సిస్తానంటూ ముందుకొచ్చాడట. అదీ ఓ సంచలనమే అప్పట్లో. అయితే, ఆశపెట్టి మోసగించాడంటూ ఆ తర్వాత శ్వేతా బసు వాపోయింది. చేత కానప్పుడు, పబ్లిసిటీ కోసం సొల్లు కబుర్లెందుకు చెప్పాలంటూ ఆ హీరోకి గట్టిగానే క్లాస్ తీసుకుందట ఓ సందర్భంలో శ్వేతా బసు.
‘చీకటి మనుషులు..’ అని శ్వేతా ప్రస్థావించింది బహుశా ఆ హీరోని ఉద్దేశించే కావొచ్చు. ఇకపోతే, తెలుగులో శ్వేతాబసు ప్రసాద్‌కి ఛాన్సులు రాకపోయినా, బాలీవుడ్‌లో బాగానే సందడి చేస్తోంది. చెప్పుకోదగ్గ సినిమాలు కాకపోయినా ఏవో ఒకటీ అరా అవకాశాలతో సరిపెట్టుకుంటోందక్కడ శ్వేతా బసు ప్రసాద్.