‘మహానటి’ సావిత్రిని గుర్తుచేస్తూ పోషించిన పాత్ర కీర్తి సురేష్ కు ఎంతటి పేరు తెచ్చిందో తెలియంది కాదు. ఇప్పుడు ‘మిస్ ఇండియా’గా తన వైవిధ్యాన్ని చూపించేందుకు సిద్ధమవుతోంది. కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. లేడీ ఓరియంటెడ్ చిత్రాలపై ఫోకస్ పెట్టిన కీర్తి నుంచి మూడు నాలుగు వరకూ అలాంటి ప్రాజెక్టులే రానున్నాయి.
కీర్తి సురేష్ లీడ్రోల్లో దర్శకుడు నరేంద్రనాథ్ తెరకెక్కిస్తోన్న లేడీ ఓరియంటెడ్ చిత్రం -మిస్ ఇండియా. పెంగ్విన్, గుడ్ లక్ సఖి అనే మరో రెండు లేడీ ఒరియంటెడ్ చిత్రాలతోనూ కీర్తి బిజీగా ఉంది.
ఇదిలావుంటే, ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేష్ కోనేరు నిర్మిస్తోన్న ‘మిస్ ఇండియా’ చిత్రం టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ సాధించటం తెలిసిందే. ‘మిస్ ఇండియా’లో కీర్తి గతంలో ఎప్పుడూ చేయని స్పెషల్ రోల్ చేస్తున్నట్టు చిత్రబృందం చెబుతోంది.చిత్రీకరణ చివరి దశకు చేరటంతో తాజాగా కీర్తి డబ్బింగ్ మొదలు పెట్టిందంటూ నిర్మాత మహేష్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. థమన్ సంగీతం సమకూరుస్తున్న చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, నరేష్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
