OTT: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం కీర్తి బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ మూవీ ఉప్పు కప్పురంబు.. నొక్క పోలికనుండు. ఇందులో సుహాస్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. అయితే థియేటర్లలో విడుదల కావాల్సిన మూవీ ఓటీటీలో విడుదల అయ్యింది. ఎలాంటి చడి చప్పుడు లేకుండా ఈ మూవీ నేరుగా ఓటీటీ లోకి విడుదల అయింది.
అమెజాన్ ప్రైమ్ తన ఓటీటీ ప్లాట్‌ఫామ్ కోసం రూపొందించిన ఒరిజినల్ మూవీ ఇది. ఐవి శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎల్లనార్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రాధికా లావు నిర్మించారు. సినిమా బండి ఫేమ్ వసంత్ కథను అందించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. జూలై 4న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. చిట్టి జయపురం గ్రామవాసులు అందించే వినోదాల విందుకు సిద్ధంగా ఉండమని ప్రైమ్ వీడియో ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది.
Get ready for this heartwarming ride with the citizens of Chitti Jayapuram 🌴🫰#UppuKappuRambuOnPrime, New Movie, July 4 pic.twitter.com/kzV6ssNucY
— prime video IN (@PrimeVideoIN) June 16, 2025
అయితే స్టార్ హీరోయిన్ అయిన కీర్తి సురేష్ మూవీ థియేటర్స్ లో కాకుండా ఇలా ఓటీటీలో విడుదల అవడం పట్ల కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే హీరోయిన్ కీర్తి సురేష్ విషయానికి వస్తే.. ఇటీవల ఈ ముద్దుగుమ్మ మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక హీరో సుహాస్ విషయానికి వస్తే ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు. కలర్ ఫోటో తో బాగా గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ వరుస హిట్లను అందుకుంటూ దూసుకుపోతున్నారు.