జూ. ఎన్టీఆర్ RRR తర్వాత దర్శకుడు ఖరారు !

టాలీవుడ్ లో మాటల మాంత్రికుడు, దర్శకుడు ‘త్రివిక్రమ్‌’ శ్రీనివాస్‌ కు, హీరో గా జూనియర్‌ ఎన్టీఆర్‌ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దర్శకుడిగా త్రివిక్రమ్‌ సాధించిన విజయాలు.. హీరో గా ఎన్టీఆర్‌ సృష్టించుకున్న ఇమేజ్ వేటికవే సాటి. అయితే వీరిద్దరి కలయికలో మరోసారి సినిమా రాబోతోందని ఫిలింనగర్‌ వర్గాల్లో హాట్ హాట్ గా టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత’ మంచి విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.. మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న తారక్‌కు ఈ సినిమా మరింత ఫాలోయింగ్‌ను తీసుకు వచ్చింది. అతడికి మంచి ఇమేజ్ ను తెచ్చిపెట్టింది.

అలాంటి వీరిద్దరూ ఈ వేసవిలో మరోసారి జతకడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇక త్రివిక్రమ్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వచ్చిన హ్యట్రిక్‌ మూవీ ‘అల వైకుంఠపురములో’ సైతం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అలాగే జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే తారక్‌ త్రివిక్రమ్‌ మూవీ షూటింగ్‌లో పాల్గొననున్నట్లు యూనిట్ వర్గాలు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా.. ఇద్దరూ..ఇద్దరే!?