మరో సారి హీరోగా ప్లాప్ హీరో పెద్ద ప్రయత్నం

పరిశ్రమలో హీరోగా స్థిరపడాలంటే ఆషామాషీ విషయమేం కాదు. స్టార్ హీరోల పిల్లలు సైతం ఇక్కడ నిలదొక్కుకోవడానికి కష్టపడటం మనకు కనిపిస్తూనే ఉంది. అలాంటిది సినిమా నేపధ్యం లేని వాళ్ళకి మరి కొంచెం కష్టం. అయితే వెనక డబ్బు ఉంటె హీరోగా బ్రేక్ వచ్చే వరకు ప్రయత్నించచ్చు.

సరిగ్గా అదే చేస్తున్నాడు ‘నువ్విలా’ హీరో హవీష్. ఆయన కొత్త సినిమా ‘సెవెన్’ కూడా పరాజయం పాలైంది. చేసిన సినిమాల వల్ల ఒరిగిందేమీ లేదు అయినా సరే మరో పెద్ద ప్రయత్నం చేస్తున్నాడు. అదే తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో హీరోగా. హవీష్ ప్రఖ్యాత కెఎల్ నారాయణ విద్య సంస్థల యజమాని కొడుకు కావడం వల్ల డబ్బుకేమీ లోటు లేదు. ఆ ధీమాతో ఈ ప్రయత్నం చేస్తున్నాడు. లింగుస్వామి ఒకప్పుడు హిట్ సినిమాలు తీసినా ప్రస్తుతం ఆయన కెరీర్ కూడా పెద్ద బాలేదు. కానీ కాష్ పార్టీ కనుక హవీష్ ను డైరెక్ట్ చేయవచ్చు.

ప్రస్తుతం హవీష్ బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ‘రాక్షసుడు’ సినిమాను నిర్మించాడు కూడా. ఆ సినిమా ఆగష్టు 2 విడుదల కానుంది. మొత్తానికి అటు హీరోగా ఇటు నిర్మాతగా బిజీ అయ్యాడు హవీష్.