ప్ర‌కాష్ రాజ్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్

శతమానం భవతి మూవీతో సూపర్ హిట్ అందుకుని తెలుగునాట సెటిల్ అయిపోయింది కేరళ భామ అనుపమ. ఆ చిత్రం తర్వాత వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. గ్లామర్ హవా నడుస్తున్న ఈరోజుల్లో కూడా అందం, అభినయంతో విమర్శకుల నుండి సైతం ప్రశంసలు అందుకుంటూ సినిమాల్లో రాణిస్తోంది. ప్రస్తుతం రామ్ సరసన ‘హలొ గురు ప్రేమ కోసమే’ మూవీలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ సమయంలో ప్రకాష్ రాజ్ కి తనకి గొడవ అయిందనే రూమర్ బయటకు వచ్చింది. ఒక సీన్ లో అనుపమ పెర్ఫార్మెన్స్ సరిగా లేనందున అసహనం చెందిన ప్రకాష్ రాజ్ కరెక్ట్ చేయబోయారని, అందుకు అనుపమ హర్ట్ అయ్యి ఏడ్చేసిందని అందుకే ఆ రోజు షూటింగ్ ఆపేశారని రూమర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.


రెండు మూడు రోజుల నుండి ఇదే వార్త బాగా స్ప్రెడ్ అవడంతో అనుపమకు చిరాకొచ్చినట్టుంది. ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఆమె ప్రకాష్ రాజ్ తో కలిసి నవ్వుతూ దిగిన ఫోటో పోస్ట్ చేసి దోజ్ జోక్స్ అంటూ క్యాప్షన్ తగిలించింది. దీనితో వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని, అవన్నీ తప్పుడు వార్తలు అని చెప్పకనే చెప్పేసింది. చాలా తెలివిగా అనుపమ ఆ దుష్ప్రచారాన్ని ఖండించింది కదూ!