Saraswathi: వరలక్ష్మి శరత్ కుమార్, పూజా శరత్ కుమార్, దోస డైరీస్ ప్రొడక్షన్ నంబర్ 1 టైటిల్ సరస్వతి

వెర్సటైల్ పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ తన కెరీర్‌లో మరో అడుగు ముందుకు వేశారు. నిర్మాతగా, దర్శకురాలిగా మారుతున్నారు. తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్‌ బ్యానర్ ని ప్రారంభిస్తున్నారు. ఇది చిత్రనిర్మాణ ప్రపంచంలో సరికొత్త ప్రయాణానికి నాంది పలుకుతోంది. ఈ బ్యానర్ పై తొలి చిత్రంగా ‘సరస్వతి’ టైటిల్ తో ఆసక్తికరమైన థ్రిల్లర్ ను ఈరోజు అనౌన్స్ చేశారు.

సరస్వతి టైటిల్ లో ‘ఐ’ అనే అక్షరం ఎరుపు రంగులో హైలైట్ చేయబడి, సినిమా ఇంటన్సిటీని ప్రజెంట్ చేస్తోంది. టైటిల్ ప్రేక్షకులలో క్యురియాసిటీ పెంచింది.

హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించగా, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నవీన్ చంద్ర ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సంగీత సంచలనం థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా, ఎ.ఎం. ఎడ్విన్ సకే కెమెరా మ్యాన్. వెంకట్ రాజేన్ ఎడిటర్, సుధీర్ మాచర్ల ఆర్ట్ డైరెక్టర్. ప్రవీణ్ డేనియల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

సరస్వతి గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు.

తారాగణం: వరలక్ష్మి శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నవీన్ చంద్ర

సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం – వరలక్ష్మి శరత్ కుమార్
నిర్మాతలు – పూజా శరత్ కుమార్ & వరలక్ష్మి శరత్ కుమార్
సంగీతం – థమన్ ఎస్
డిఓపీ – ఎ.ఎం. ఎడ్విన్ సకే
ఎడిటర్ – వెంకట్ రాజేన్
ఆర్ట్ డైరెక్టర్ – సుధీర్ మాచర్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- ప్రవీణ్ డేనియల్
పీఆర్వో- వంశీ శేఖర్

Chalasani Srinivas Fires On Balakrishna Comments | Praises CM Jagan | Telugu Rajyam