ఏజెంట్ ఆత్రేయ కు దర్శకేంద్రుడి అభినందనలు

మన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు అంటే ఎంతో మందికి ఆదర్శం, అభిమానం అంతకు మించి ఇంకేదో కూడా. అటువంటి ఆయన దగ్గర నుంచి ఇప్పుడిప్పుడే సినిమాల్లో బుడి బుడి అడుగులు వేస్తున్న వాళ్ళకి శభాష్ అంటూ వెన్ను తడితే అది వాళ్లకి ముందుకు సాగడానికి ఎంతో ధైర్యాన్నిస్తుంది కదూ.
అదే జరిగింది ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ బృందానికి. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ సినిమా చూసి చాలా మంచి సినిమా తీసారని ఆయన స్వయంగా మెచ్చుకున్నారు. ఆ సందర్బంగా క్లిక్ మన్న చిత్రం ఇది.
ఇక ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని విజయవంతం చేసి, హీరో నటనకు వంద మార్కులూ వేసి ముందుకు నడిపించారు.