బలహీనంగా ఆది ‘జోడి’ – ట్రైలర్ రివ్యూ!

 

బలహీనంగా  ఆది ‘జోడి’ ట్రైలర్ రివ్యూ!

‘గత బుర్ర’ కథతో అపజయాన్ని ఎదుర్కొన్న యంగ్ హీరో ఆది ‘జోడీ’ లో నటిస్తున్నాడు. దీని ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. ఇందులో ‘జెర్సీ’ కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎ. విశ్వనాథ్ కొత్త దర్శకుడు. కుటుంబ నేపథ్యంలో ప్రేమ కథలా ఈ ట్రైలర్లో విషయం కనపడుతోంది. అయితే ఈ ప్రేమ కథలో పాయింటేమిటో, ఎందుకు చూడాలో క్లూ ఏమీ ఇవ్వకుండా సాదాగా వదిలేశారు. కొన్ని రోమాంటిక్ సీన్లు, కొన్ని కుటుంబ సీన్లు వేసి, మధ్యలో సీరియస్ అయినట్టు ఆర్టిస్టుల ఎక్స్ ప్రెషన్స్ వేశారు, అంతే. హీరో తండ్రి పాత్రలో నరేష్ క్రికెట్ బెట్టింగ్ వల్ల కష్టాల్లో పడినట్టు, ఇదే ప్రేమకి బ్రేకు వేసినట్టు అర్ధమవుతోంది. ఇంతకి మించి ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులని థియేటర్ల వైపుకు లాగే సెల్లింగ్ పాయింటేమీ లేదు. టైటిల్ కూడా పాతగా, బలహీనంగా వుంది. అయితే న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా అని పోస్టర్ మీద ఇచ్చారు. ఆ వాసనే ట్రైలర్ లో  లేదు. 

ఇతర పాత్రల్లో గొల్లపూడి మారుతీరావు, వెన్నెల కిషోర్‌, విద్యుల్లేఖ కన్పిస్తున్నారు. సంగీతం ఫణి కళ్యాణ్. భావన క్రియేషన్స్‌ బ్యానర్‌పై గుర్రం శ్రీనివాస్‌, పద్మజ, సాయి వెంకటేష్‌లు నిర్మిస్తున్నారు. ఈ కుటుంబ ప్రేమ కథ సెప్టెంబర్ 6 న ప్రేక్షకుల ముందు కొస్తోంది.

https://www.youtube.com/watch?v=PFHnoKEejbk