సైంధవ్‌: విక్టరీ వన్‌ మ్యాన్‌ షో!

విక్టరీ వెంకటేష్‌ కెరీర్‌లో 75వ చిత్రంగా తెరకెక్కిన ‘సైంధవ్‌’ సినిమా సంక్రాంతి స్పెషల్‌గా శనివారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చింది. మొదటి నుండి ఈ సినిమాపై పాజిటివ్‌ వైబ్సే ఉన్నాయి. సంక్రాంతికి భారీ పోటీ ఉన్నప్పటికీ.. కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో మేకర్స్‌ సంక్రాంతి బరిలోకి ‘సైంధవ్‌’ని దింపారు. ట్రైలర్‌లోనే స్టోరీ మొత్తం చెప్పేసినా.. సినిమా వెంకీ కెరీర్‌లోనే ది బెస్ట్‌ అని చెప్పుకునే కంటెంట్‌ ఉంటుందని దర్శకుడు శైలేష్‌ కొలను మొదటి నుండి చెబుతూ వస్తున్నారు.

శైలేష్‌ చెప్పినట్లే.. ఈ సినిమాలో కంటెంట్‌ బాగుందని, వెంకటేష్‌ కెరీర్‌లోనే ది బెస్ట్‌ చిత్రం అవుతుందని.. ఇప్పటికే ఈ సినిమా చూసిన వాళ్లు సోషల్‌ మీడియా వేదికగా రియాక్ట్‌ అవుతున్నారు. నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా ‘సైంధవ్‌’ రివ్యూస్‌ డిఫరెంట్‌గా చూపారు. వెంకీమామ ఇంతకు ముందు సినిమాలతో పోల్చితే.. ‘సైంధవ్‌’ బెటర్‌ స్టోరీ. ముఖ్యంగా రైట్స్‌ చాలా బాగున్నాయి. ఈ సంక్రాంతికి పైసా వసూల్‌ సినిమా ఇది… అంటూ ఓ నెటిజన్‌ ఈ సినిమాకు 5కి 3 రేటింగ్‌ ఇచ్చారు.

కంగ్రాచ్యులేషన్స్‌ వెంకీమామ.. నా గుండెల్లో ఎప్పుడూ నువ్వే ఉంటావ్‌.. వెంకీ 75’సైంధవ్‌’తో బ్లాక్‌బస్టర్‌ కొట్టేశామ్‌. థ్యాంక్యూ శైలేష్‌ కొలను.. అంటూ ఓ నెటిజన్‌ నిర్మాణ సంస్థకు శుభాకాంక్షలు తెలిపారు. స్టాఫ్‌ అదిరింది. వెంకీమామ అదరగొట్టాడు. సెకండాఫ్‌లో షాట్స్ అయితే మాములుగా లేవు. ఇందులో ఉన్న ఎమోషనల్‌ సీన్స్‌కి ఫ్యామిలీ ఆడియెన్స్‌ బాగా కనెక్ట్‌ అవుతారు. వెంకటేష్‌ వన్‌ మ్యాన్‌ షో.

శైలేష్‌ కొలను ఫ్యాన్‌ బాయ్‌ డైరెక్షన్‌ అంటే ఇలా ఉండాలి.. అంటూ ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశారు. ఇప్పుడే సైంధవ్‌ చూశాను. యావరేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. వెంకటేష్‌ చాలా బాగా చేశారు. ఫస్టాఫ్‌ కంటే సెకండాఫ్‌ చాలా బాగుంది. మొత్తంగా అయితే సినిమా వేరే లెవల్‌. నవాజుద్దీన్‌ సిద్ధిఖి ఈ సినిమాకి సర్‌ప్రైజ్‌ ప్యాకేజ్‌.. అంటూ ఓ నెటిజన్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. సంక్రాంతికి వెంకటేష్‌ హిట్‌ కొట్టడం మాములే.

5 సంవత్సరాల తర్వాత మళ్లీ సంక్రాంతికి వచ్చాడు.. హిట్‌ కొట్టాడు. శైలేష్‌ కొలను ఈ వెంకీ 75తో మళ్లీ వెంకటేష్‌లోని మాస్‌ చూపించావ్‌. డిజప్పాయింటింగ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ అంటూ ఓ నెటిజన్‌ 2.75 రేటింగ్‌ ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమాకు పాజిటివ్‌, నెగిటివ్స్‌ ఏంటో కూడా చెప్పుకొచ్చారు. వెంకటేష్‌ అభినయం, కొన్ని యాక్షన్‌ సన్నివేశాలు ఈ సినిమాకు ప్లస్‌లు అని.. ప్లాట్‌ నేరేషన్‌, సంతోష్‌ నారాయణన్‌ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, బోర్‌ కొట్టించే స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు మైనస్‌లని తెలిపాడు.

ఇలా కొందరు పాజిటివ్‌గానూ, మరికొందరు నెగిటివ్‌గానూ సోషల్‌ విూడియాలో స్పందిస్తున్నారు. ఓవరాల్‌గా అయితే మిక్స్‌డ్‌ టాకే వినబడుతోంది. మరి ఈ సినిమా హిట్టా, ఎª`లాపా అనేది కాసేపట్లో వచ్చే రివ్యూలో తెలుసుకుందాం. వెంకీ ల్యాండ్‌ మార్క్‌ ఫిల్మ్‌ అయిన ఈ ‘సైంధవ్‌’ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నిర్మాత వెంకట్‌ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.