Saindhav Movie Review : సైంధ‌వ్ మూవీ రివ్యూ & రేటింగ్

పాప కోసం సైంధ‌వ్, ఒక తండ్రి తపన, ఒక పాప ప్రాణం , ఒక మంచి కారణం కోసం జరిపిన పోరాటం

హిట్ 1,2 దర్శకత్వం వహించిన శైలేష్ తన రచనలలో ఉన్న కుటుంబ విలువలు , ప్రాణం విలువని మరో మెట్టు ఎక్కేలా చేసి సైంధ‌వ్ తీసాడు , ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన సైంధ‌వ్ ఎలా ఉందొ చూసేదామా మరి !!!

కథ :

సైంధ‌వ్ ఒక సైకో , కార్టెల్ లో తన పేరు వింటే భయపడిపోతారు … అన్ని వదిలేసి కూతురికోసం బతుకుతుంటాడు సైంధ‌వ్ . మనో (శ్రద్ధ శ్రీనాథ్ ) వారి ఇంటి పక్కన ఉంటూ పాపని చూసుకుంటుంది … వారి జీవితాలలో అలజడి పాప ప్రాణం మీదకి వచ్చిన స్పైనల్ మాస్క్యూలర్ ఎంట్రోపీ అనే వ్యాధి , దానికి కావాల్సిన 17 కోట్ల విలువ కలిగిన వైల్ …

డబ్బుకోసం సైంధ‌వ్ ఎం చేసాడు , పాపని రక్షించుకున్నాడా లేదా , అసలు నవాజుద్దీన్ ఎవరు ?

తెలియాలంటే చిత్రం చూడాల్సిందే

వెంకటేష్ :

విక్టరీ తన ఇంటి పేరు , కలియుగ పాండవులతో ప్రారంభించిన తన ప్రస్థానంలో , ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించి మనల్ని అలరించిన వెంకటేష్ తన 75 చిత్రం సైంధ‌వ్ లో కూడా ఏ మాత్రం నిరాశపరచలేదు …

కూతురి కోసం ఎంత యుద్ధం చేయగలడో అంతా చేసాడు … కూతురి ముందు దైర్యం , వెనక బాధ , రక్షించుకోవాలంటే చేయాల్సిన యుద్ధం అన్నింటిలో ఒక అద్భుత నటన చూపించాడు వెంకటేష్ , ఎంత బాగుందో అయన అభినయం , ఇవాళ మనామా కొత్తగా చెప్పుకోవక్కర్లేదు కానీ , కచ్చితంగా తల్చుకోవాల్సిందే …

నవాజుద్దీన్ :

వికాస్ గా నవాజ్ నటన బాగుంది , సైకో లాగ ఉంటాడు , చాల బాగుంది అతని మొదటి అడుగు తెలుగు చిత్రాలలో ..

శైలేష్ :

దర్శకత్వం భేష్ , రచన భేష్ , డైలాగ్స్ భేష్ , హిట్ 1,2 ల కన్నా ఈ చిత్రం లో ఎమోషన్స్ చాల బాగున్నాయి … అసలు బోర్ కొట్టకుండా ప్రతి సన్నివేశం ఎంతో ఒద్దికగా పద్దతిగా తెరకెక్కించిన వైనం బాగుంది … అసలు కదా మొత్తం ట్రైలర్ లో చెప్పేసి చిత్రం మొత్తం కదలకుండా చూపించిన వైనం చాల బాగుంది … ఎక్కడా అనవసరమైన టైం వేస్ట్ సన్నివేశాలు లేవు , ఇంగ్లీష్ చిత్రం లా పాయింట్ to పాయింట్ చిత్రం నడుస్తుంది … మొత్తం శైలేష్ కె చెల్లుతుంది ఆ పేరు

బాగున్నవి :

సంతోష్ నారాయణ సంగీతం , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి , మణికందన్ కెమెరా వర్క్ బాగుంది , మొత్తం చంద్రప్రస్థ నగరం చాల బాగా చూపించాడు ,గ్యారీ ఎడిటింగ్ ముక్యంగా చెప్పాలంటే , హాలీవుడ్ స్టైల్ లో ఉంది

ఆండ్రియా జెర్మియా, శ్రద్ధ శ్రీనాథ్, రుహని శర్మ కథల ఎంపిక చాల బాగుంది , నటన కూడా , జయ ప్రకాష్ గారు పోర్ట్ ఆఫీసర్ గ బాగా చేసారు , ఆర్య సైంధ‌వ్ సపోర్ట్ గా కనిపించి బాగా చేసాడు

పాప కి వెంకటేష్ కి మధ్య తండ్రి కూతుళ్ల ప్రేమ చాల అంటే చాల బాగుంది

ఇంకా బాగుండేవి :

తెలుగు చిత్రాలలో ఉన్న మూస బెదిరింపులు విలన్ దగ్గరనుంచి హీరో తో తప్పిస్తే బాగుండేది , కొన్ని లాజిక్స్ వదిలేసారు క్లైమాక్స్ లో

మొత్తానికి :

వెంకటేష్ నటన , శైలేష్ దర్శకత్వం , కథ,కధనం అన్ని వెరసి సైంధ‌వ్ ని సంక్రాంతి విజేతని చేయచ్చు అని చెప్పాల్సిందే అందుకే ఈ చిత్రానికి నా రేటింగ్

రేటింగ్: 3.5/5

పవన్ దావులూరి