అఫీషియల్ : జస్ట్ 3 వారాల్లో ఓటిటిలోకి వెంకీ మామ ‘సైంధవ్’

Saindhav-Movie

ఈ ఏడాది సంక్రాంతి కాముకః టాలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో వెంకీ మామ హీరోగా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా యంగ్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన భారీ బడ్జెట్ ఏక్షన్ చిత్రం ‘సైంధవ్’ కోసం అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రం వెంకీ మామ కెరీర్ లో 75వ సినిమాగా ఎన్నో అంచనాలు మీద తెరకెక్కించి రిలీజ్ చేశారు.

కానీ సీన్ కట్ చేస్తే ఈ చిత్రం భారీ డిజాస్టర్ అయ్యింది. దీనితో ఈ సంక్రాంతి రేస్ లో వచ్చిన ఏకైక ప్లాప్ గా ఇది మిగిలిపోగా ఈ చిత్రం అయితే ఇప్పుడు అప్పుడే ఓటిటి లో సందడి చేసేందుకు వచ్చేస్తుంది. కాగా ఈ చిత్రాన్ని ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ ఫిబ్రవరి 2 నుంచి అలా అందుబాటులోకి తీసుకొస్తారు అని తెలిపాము.

కానీ ఇప్పుడు అఫీషియల్ గా డేట్ అయితే వచ్చేసింది. దీనితో ఈ సినిమా ఈ ఫిబ్రవరి 3 నుంచి ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రాబోతుంది అనేది ఫిక్స్ అయ్యింది. దీనితో ఈ సినిమా కేవలం మూడు అంటే మూడు వారాల్లో మాత్రమే స్ట్రీమింగ్ కి వచ్చేస్తుంది అని చెప్పాలి.

కొన్ని చిత్రాలు నాలుగు వారాల్లోనే వస్తున్నాయి కానీ ఈ చిత్రం మూడు వారాల్లోనే వచ్చేస్తుండడం ఆశ్చర్యకరం. ఇంకా ఈ భారీ చిత్రంలో ఆండ్రియా జెరెమియా, తమిళ నటుడు ఆర్య లు కూడా కీలక పత్రాలు చేయగా బాలీవుడ్ వెర్సటైల్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖ్కీ సాలిడ్ పాత్రలో నటించి టాలీవుడ్ డెబ్యూ ఇచ్చారు.