అందుకే బిజెపికి కేసీఆర్ మద్దతు : రేవంత్

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి టిఆర్ ఎస్ పై విరుచుకుపడ్డారు. టిఆర్ ఎస్ కు ఎవరితో సంబంధాలున్నాయో అనే విషయం పై ముసుగు తొలగిపోయిందన్నారు. రాజ్యసభ వైస్ చైర్మన్ ఎన్నికలో ఎన్డీఏకి ఓటు వేసి మోదీతో కలిసి పనిచేయబోతున్నారనే సంకేతం టిఆర్ ఎస్ ఇచ్చిందన్నారు. ఓయూలో రాహుల్ టూర్ ను అడ్డుకుంటామని టిఆర్ ఎస్ నేతలు విర్రవీగుతున్నారని దమ్ముంటే రాహుల్ పర్యటనను అడ్డుకోండి మా దమ్మెంటో చూపిస్తామని హెచ్చరించారు. నేనే ముందుండి నడుస్తా చేతనైతే రాహుల్ ను అడ్డుకోవడానికి హరీష్ కేటీఆర్ రావాలని వారిని తొక్కిపడేసైనా సరే రాహుల్ ని  ఓయూ పర్యటన చేయించి తీరుతామన్నారు.

కేసీఆర్ బిజెపికి మద్దతిస్తుంటే ఎంఐఎం కేసీఆర్ కు మద్దతు ఎందుకు ఇస్తుందో ఆలోచన చేయాలని మైనారిటి సోదరులను కోరారు. టిఆర్ ఎస్ , ఎంఐఎం కలిసి మైనారిటిలను మోసం చేస్తున్నాయని దీనిని మైనారిటి సోదరులు ఆలోచించాలని కోరారు. మోదీకి కేసీఆర్ కు మధ్యగా అనుసంధాన కర్తగా అదానీ వ్యవహరిస్తున్నాడని, కరుణానిధి మరణించినప్పుడు కేసీఆర్ అదానీ పొంత విమానంలో చైన్నై పోయిండని దీంతోనే వారి మధ్య దోస్తి అర్ధం చేసుకోవచ్చని ఆయన విమర్శించారు. ఛత్తీస్ గడ్ మార్వా విద్యుత్ కంపెనీకి బొగ్గు సరఫరా చేస్తుందని, మార్వా కంపెనీ విద్యుత్ తెలంగాణ కొనుగోలు చేయకపోతే అదానీ కంపెనీ దెబ్బతీస్తుందని అందుకే దొంగలంతా కలిసిపోయారన్నారు. కేసీఆర్ తన స్వంత ప్రయోజనాలక కోసం  తెలంగాణ ప్రజల జీవితాలను బలిస్తున్నాడని రేవంత్ దుయ్యబట్టారు. తన పిల్లలను ఏసీ గదుల్లో పెట్టి పేద పిల్లలను రోడ్డు మీద పెట్టడం కేసీఆర్ కు అలవాటని రేవంత్ విరుచుకుపడ్డారు.

కేసీఆర్ ఆడుతున్న నాటకాలన్నింటికి త్వరలోనే తెరపడుతుందని, రాష్రంలో జరుగుతున్న పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారని కేసీఆర్ కుటుంబాన్ని తరిమే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. ప్రజలే వారికి బుద్ది చెబుతారని కేసీఆర్ కూలిపోవడం ఖాయమని రేవంత్ అన్నారు..