ఎచ్చర్లలో కొత్త రచ్చ… తప్పుడు నిర్ణయం అంటున్న తమ్ముళ్లు!

తెలిసి చేశారో.. తెలియక చేశారో.. తప్పని తెలిసినా తప్పక చేశారో తెలియదు కానీ… కొన్ని నియోజకవర్గాల విషయంలో చంద్రబాబు వ్యూహాత్మక తప్పిదాలూ చాలానే చేశారని అంటున్నారు తమ్ముళ్లు. ప్రధానంగా మొహమాటాలకో.. లేక, కక్కుర్తికో పోయి కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికలో తప్పులు చేస్తే.. మరికొన్ని నియోజకవర్గాలను పొత్తులో భాగంగా కేటాయించడంలో రాంగ్ స్ట్రాటజీ ఫాలో అయ్యారని అంటున్నారు.

కూటమిలో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్ సభ (పవన్ లెక్క ప్రకారం… 6*7 = 49 + 10 అసెంబ్లీ నియోజకవర్గాలు!) కేటాయించింది టీడీపీ. గత ఎన్నికల్లో ఒక్కశాతం ఓట్ షేర్ కూడా లేని పార్టీకి ఇన్ని సీట్లు ఎందుకు కేటాయించారనే విషయం కాసేపు పక్కనపెడితే… కేటాయించిన వాటిలో ప్రధానంగా కొన్ని నియోజకవర్గాల్లో రాంగ్ అనాలసిస్ చేశారని తమ్ముళ్లు వాపోతున్నారంట. ఇందులో భాగంగా.. ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని ప్రస్థావిస్తున్నారు.

అవును… ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానాన్ని భారతీయ జనతాపార్టీకి కేటాఇంచడం ఒక వ్యూహాత్మక తప్పిదం అని అంటున్నారు తమ్ముళ్లు! ఇక్కడ సామాజిక సమీకరణాలపై అవగాహన ఉండి కూడా.. చంద్రబాబు తప్పులో కాలేశారని అంటున్నారు. ఇక్కడ తూర్పు కాపులు ఎక్కువని తెలిసినా.. ఆ సామాజికవర్గానికి కాకుండా… కమ్మ సామాజికవర్గానికి చెందిన వారికి టిక్కెట్ ఇవ్వడం అంటే… ఈ సీటు వదిలేసుకున్నట్లేనని చెబుతున్నారంట.

ఇలా తూర్పు కాపులు ఎక్కువగా ఉన్న ఎచ్చర్ల నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గానికి చెందిన ఈశ్వర్ రావు ని పోటీ చేయిస్తుండటం ఒక మైనస్ అయితే… అది కూడా బీజేపీ నుంచి కావడం మరొ మైనస్ అని అంటున్నారంట స్థ్హానిక తమ్ముళ్లు. ఇక్కడ ఆ సామాజికవర్గానికీ బలం లేదు.. ఆ పార్టీకీ బలం లేదై వాపోతున్నారంట. ఈ సమయంలో తూర్పు కాపులను కాదని 2009లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతను ఇక్కడ నిలబెడితే… ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారంట తమ్ముళ్లు.

ఈ క్రమంలో కిమిడి కళా వెంకటరావు.. లేక, కలిశెట్టి అప్పలనాయుడికి టిక్కెట్ ఇచ్చి ఉంటే గెలిచే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారని తెలుస్తుంది. అలా కాకుండా ఇలానే ఫిక్సయ్యామని భావిస్తే… ఎచ్చర్ల ను కౌంట్ చేసుకోవద్దని సుటిగా చెబుతున్నారంట. అయితే… టీడీపీ, జనసేన నేతలు సహకరించి బీజేపీ నేతలు గెలిపిస్తారని.. ఆయనకున్న అంగబలం, అర్దబలం వల్ల సంపాదించుకున్న టిక్కెట్ కు న్యాయం చేస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారని తెలుస్తుంది!

మరోపక్క తనకు టిక్కెట్ దక్కకపోవడంతో కిమిడి కళా వెంకట్రావు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని అంటున్నారు. ఈ సమయంలో ఆయనను ఇండిపెండెంట్ గా పోటీచేయాలని అనుచరులు ఒత్తిడి తెస్తున్నారని సమాచారం!