కేసీఆర్ ఓడిపోతే ఏం చేస్తారో ముందే చెప్పిన కుర్రాళ్ళు !

Youth voters shock treatment work for TRS

రెండోసారి అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ మీద అయినా జనంలో కాస్తో కూస్తో  వ్యతిరేకత రావడం సహజం.  అదే తెరాస మీద కూడ కనిపిస్తోంది.  కానీ అది కాస్త ఎక్కువ మోతాదులో ఉంది. అపర మేధావి కేసీర్ సైతం జనంలో తమపై ఇంత వ్యతిరేకత ఉందని గుర్తించలేకపోయారు.  అయితే కేసీర్ 2014లో ముఖ్యమంత్రి అయిన నాటి నుండి ఆయన మీద వ్యతిరేకత పెంచుకున్న వర్గంలో యువకులు ఒకరు.  తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యహరించిన విద్యార్థులు కేసీఆర్ ఉద్యమకారుల కుటుంబాలను న్యాయం చేయలేదని, అమరవీరుల కుటుంబాలను ఆదుకోలేదని తిరగబడ్డారు.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు పెంచారు.  మొదటట్లో విద్యార్థి సంఘాల హడావుడి బాగానే ఉన్నా మెల్లగా తగ్గిపోయింది.  ఒకానొల్ల దశలో ఉద్యమంలో పాల్గొన్న యువత ఏమైంది  అనుకునేలా మారింది వాతావరణం.  

టీవీ, పత్రికల్లో యువకుల్లోని వ్యతిరేకత ప్రొజెక్ట్ కాలేదు.  దీంతో చివరికి అందరూ సోషల్ మీడియాను ఆశ్రయించారు.  సామజిక మాధ్యమాలు వేదికగా తన బాధను  వెళ్లగక్కారు.  ఆవేశాన్ని ప్రదర్శించారు.  ఇప్పటికీ అదే చేస్తున్నారు.  ఇక నిరుద్యోగ యువత బాధ అంతా ఇంతా కాదు.  ఉపాధి లేక నానా తంటాలు  పడుతున్నామని, ఉపాధి మార్గాలు చూపాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టులను భర్తీ చేయాలని పదే పదే విన్నవించుకున్నారు.  కేసీఆర్ ఇస్తున్న నిరుద్యోగ భృతి తమకు అవసరం లేదని, ఉద్యోగాలు కావాలని డిమాండ్ చేశారు.  కానీ అవేవీ జరగలేదు.  ప్రభుత్వంలోని పలు విభాగాల్లో దాదాపు లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటే ఉద్యోగాల కల్పన మీద ప్రభుత్వం చిత్తశుద్ధి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.  అందుకే యువకులు తిరగబడ్డారు.  

Youth voters shock treatment work for TRS
Youth voters shock treatment work for TRS

బయట ఎలాగూ పోరాడే వీలులేదు కాబట్టి ఓటు ద్వారా సాధించాలని ఓపిగ్గా   ఎదురుచూశారు.  గత దుబ్బాక ఎన్నికల్లో తెరాసకు వ్యతిరేకంగా సామజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది.  అందులో తెరాస ప్రత్యర్థి  రాజకీయ పార్టీల కంటే యువకులే ఎక్కువగా కనిపించారు.  ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఈసారికి ఓడించమని పిలుపునిచ్చారు.  అది బాగా పనిచేసింది.  ఎన్నికల్లో బీజేపీ గెలిచింది.  ఆ ఓటమితో ప్రభుత్వం నుండి గ్రేటర్ ఎన్నికల సందర్బంగా కొన్ని వరాలు కురిశాయి.  ఆస్తి పన్నులో మినహాయింపులు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.  దీంతో దుబ్బాకలో ఓడిస్తే పన్నులు తగ్గాయి.. కాబట్టి గ్రేటర్ ఎన్నికల్లో ఓడగొట్టండి ఉద్యోగాలు వస్తాయని మరింత జోరుగా క్యాంపైనింగ్ చేశారు.  దానికి తోడు వరదల నెగెటివిటీ గట్టిగా పనిచేసింది.  

వెరసి గ్రేటర్ ఎలక్షన్లలో తెరాస 55 స్థానాలకు పడిపోవాల్సి వచ్చింది.  యువత ఏ ఉద్దేశ్యంతో అయితే తెరాసను ఓడించమని అన్నారో అదే ఇప్పుడు జరుగుతోంది.  ప్రభుత్వం ఉన్నట్టుంది ఉద్యోగాల భర్తీకి పూనుకుంది.  ప్రభుత్వంలోని పలు శాఖల్లో ఉన్న ఖాళీలను వెంటనే గుర్తించి అవసరాన్ని బట్టి నోటిఫికేషన్లు  విడుదలచేయాలని సీఎస్ ను ఆదేశించింది.  నిజానికి పోలీస్ శాఖ, ఉపాధ్యాయ శాఖల్లో వేల పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి.  అన్ని శాఖల్లో కలిపి లక్ష ఖాళీలు ఉండొచ్చని, వాటిలో 50 వేల పోస్టులు ఇప్పుడు భర్తీ కానున్నాయని తెలుస్తోంది.  వాటిని ఈపాటికే భర్తీచేసి ఉండాల్సింది.  కానీ చేయలేదు.  అదే యువతకు నచ్చలేదు.  అందుకు తెరాసకు ఈ పరిస్థితి తలెత్తింది.  అయితే యువత మాత్రం ఓడిస్తే ప్రభుత్వం ఏం చేస్తుందనే విషయాన్ని బాగా పసిగట్టగలిగారు.