కవిత కారెక్కడ? : నిజామాబాద్ కొత్త సమస్య

ఏప్రిల్ 11న జరుగున్న లోక్ సభ ఎన్నికల పోలింగ్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురు, నిజామాబాద్ సిటింగ్ ఎంపి, టిఆర్ ఎస్ అభ్యర్థి కవిత కారు ఎక్కడుందో వెదుక్కోవాల్సిన పరిస్థితి వస్తున్నది.

రాష్ట్రమంతా చకచకా ఎలెక్టానిక్ పోలింగ్ మిషన్ మీద కారు బటన్ నొక్కి పోలింగ్ జరుగుతూ పోతుంటే నిజామాబాద్ లోక్ సభనియోజకవర్గం లో మాత్రం ఓటర్లు చేంతాడంత బ్యాలెట్ పేపరో కవిత కారును వెదుక్కోవలసి వస్తుంది. ఈ బ్యాలెట్ పొడవెంతో  ఈ రోజు సాయంకాలం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిస్తే ఎంత మంది అభ్యర్థులు రంగంలో ఉంటారో కచ్చితం తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు.

ఎందుకంటే, జిల్లాలో గత అయిదేళ్లలో తమ సమస్య పరిష్కారం కాలేదనే  ఆగ్రహంలో ఉన్న పసుపు రైతుల దెబ్బకు ఎన్నికల కమిషన్ బ్యాలెట్ పేపర్లను ముద్రించేందుకు యోచిస్తున్నది.

ఈ నియోజవర్గంలో కవితకు వ్యతిరేకంగా భారీగా నామినేషన్లు పడ్డాయి. అందులో చాలా వాటిని తిరస్కరించినా 189 నామినేషన్లను ఎన్నికల అధికారులు అమోదించారు. దీనితో బ్యాలెట్ పేపర్లను ముద్రించడం, బ్యాలెట్ పెట్టెలను సమీకరించేపనిలో అధికారులు పడిపోయారు.


నిజామా బాద్ లో క్ సభ నియోజకవర్గానికి బ్యాలెట్ వోటింగ్ కు వెళ్లాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి నిర్ణయం తీసుకున్నారు. ఈనియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపి మధు యాస్కి నామినేషన్ వేస్తే, బిజెపి అభ్యర్థిగా డి అరవింద్ పోటీ లో ఉన్నారు.

అయితే, ఎంపిగా కవిత తమ సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని నియోజకవర్గంలోని పసుపురైతులు నిరసనగా ఎన్నికల్లో నిలబడాలనుకున్నారు. వందలో సంఖ్యలో నామినేషన్ వేస్తే తమ నిరసన ప్రపంచానికి తెలుస్తుందని, అదే విధంగా తమ సమస్య తీవ్రత కూడా ప్రభుత్వాలకు తెలుస్తుందని సుమారు 200 మందికి పైగా పసుపు రైతులు నిరసన నామినేషన్లు వేశారు.ఇందులో కొన్ని తిరస్కరణకు గురయితే మిగతావి ఆమోదం పొందాయి. చివరకు బరిలో దాదాపు 185 మంది రైతులు మిగిలారు.

ఎన్నికల ప్రధాన అధికారి వివరణ

ఇపుడు అమలులో ఉన్న ఎలెక్ట్రానిక్ వోటింగ్ మిషన్లు కేవలం 63 మంది అభ్యర్థుల పోటీకే సరిపోతాయి. మరొక బటన్ నోటాకు వుంటుంది. నిజామాబాద్ లో 189 మంది బరిలో ఉన్నారు. కాబట్టి వీళ్లందరికి ఇవిఎం లో చోటుండదు. అందువల్ల బ్యాలెట్ పేపర్లను ముద్రించడమే మార్గమని ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ చెబుతున్నారు. దీనికోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే, ఈ లోపు రైతులకు నచ్చచెప్పి నామినేషన్లను ఉపసంహరింపచేసేందుకు ప్రయత్నాలు జరగుతుున్నాయి. అందువల్ల నంబర్ తగ్గి బ్యాలెట్ పేపర్ ముద్రణ గొడవ తప్పుతుందేమో చూడాలి.

అయితే, కమిషన్ మాత్రం 189 మంది అభ్యర్థుల పోటీ కోసం ఏర్పాట్లలో మునిగి ఉంది. ‘దీనికి పెద్ద పెద్ద బ్యాలెట్ బ్యాక్సులు కావాలి. ఏక్కడదొరుకుతాయో జిల్లాకలెక్టర్ల నందరిని సంప్రదిస్తున్నాం,’ అని ఆయన చెప్పారు.

సమస్య ఇది

ఈ ప్రాంతంలో చాలా రోజులుగా పసుపు, ఎర్రజొన్నరైతులు గిట్టుబాటు ధరలకోసం ఉద్యమం చేస్తున్నారు. రాస్తా రోకో నిర్వహించారు, తెలంగాణ ఉద్యమ శైలిలో  రోడ్ల మీద వంటా వార్పు నిర్వహించారు.  వాళ్లు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న మద్ధతు ధర పెంపు. పసుపు మద్దతు ధర ను క్వింటాలకు ఇపుడున్న రు. 5000  నుంచి రు. 15వేలకు పెంచాలని వారు కోరుతున్నారు. అదేవిధంగా పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయిదేళ్లలో ఎంపిగా కవిత, ప్రభుత్వం నడుపుతూ టిఆర్ ఎస్ ఈ సమస్యను పరిష్కరించలేకపోయారని రైతులు ఆరోపిస్తున్నారు. అందుకే ఈనిరసన నామినేషన్లు.

 రాజకీయ కుట్ర

అయితే, దీని వెనక రాజకీయాలున్నాయని కవిత ఆరోపిస్తున్నారు. తాను పసుపు బోర్డుకోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నానని, ఇది కేంద్రం తీసుకోవాలసిన నిర్ణయమని ఆమెచెబుతున్నారు.  తాను ఎపుడూ  ఈ సమస్యను లేవనెత్తుతూనే ఉన్నానని,  బోర్డు ఏర్పాటుచేసే దాకా వదలేది లేదని  ఆమె చెబుతున్నారు.