కేసిఆర్, కవిత, కేటిఆర్ పై శ్రీరెడ్డి అగ్లీ పోస్ట్

శ్రీ రెడ్డి పేరు తెలియని తెలుగు వారు ఉండరు. తెలుగు వారే కాదు తమిళ జనాల్లో కూడా శ్రీరెడ్డి పేరు మారుమ్రరోగిపోతున్నది. అంతగా ఆమె చేసిందేంటబ్బా అంటే అందరికీ తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో పోరాటం చేసింది. కానీ ఆమె పోరాటం నిజమైన బాధితులకు మేలు చేకూరిందా అంటే సరైన సమాధానం ఉండదు. ఆమె పోరాటం పేరుతో పాపులారిటీ కోసం చేసిన ఆరాటమే ఎక్కువ అన్న విమర్శలు కూడా ఉన్నాయి.

తాజాగా శ్రీరెడ్డి తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో సిఎం కేసిఆర్ కుటుంబం మీద తీవ్రమైన కామెంట్స్ చేసింది. బూతు పోస్టులు, బూతు వీడియోలతో నిత్యం వార్తల్లో ఉండే శ్రీరెడ్డి తాజాగా తెలంగాణ సిఎం కేసిఆర్ కుటుంబం మీద కామెంట్స్ చేసింది.కేసిఆర్, కేటిఆర్, కవిత పేర్లు ప్రస్తావించకుండానే వారి మీద విమర్శలు గుప్పించింది. ‘‘అమ్మాయిలు లేకుంటే కొడుకుకు నిద్ర పట్టదు, మందు లేకుంటే తండ్రికి నిద్ర పట్టదు, కబ్జాలు లేకుంటే బిడ్డకు నిద్ర పట్టదు’’ అన్నది శ్రీరెడ్డి పోస్టు సారాంశం.

వారి గురించి శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ వాల్ మీద పెట్టిన పోస్టు కింద ఉంది చూడొచ్చు. అయితే శ్రీరెడ్డి వారి పేర్లను ప్రస్తావించకుండానే ఆరకమైన పోస్టు చేయడం వివాదం రేపుతున్నది. ఇక్కడ మరో విషయమేమంటే? శ్రీరెడ్డి అలా పోస్టు చేయడమే కాదు దానికింద మరో పోస్టు కూడా ఉంది.

అందులో ఏముందంటే తెలంగాణలో మహా కూటమి అధికారంలోకి రావాలని, మహా కూటమికి సపోర్టు చేస్తూ మరో పోస్టు చేసింది. దీన్నిబట్టి శ్రీరెడ్డి పెట్టిన పోస్టు సిఎం కుటుంబం గురించే అన్న విమర్శలు రేగుతున్నాయి. ఇక శ్రీరెడ్డి గతంలో కూడా సిఎం కుటుంబం మీద కామెంట్స్ చేసింది. క్యాస్టింగ్ కౌచ్ పోరాటంపై సిఎం కేసిఆర్ స్పందించడంలేదని ఆరోపించింది. అంతేకాకుండా జన సేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఇప్పటి వరకు హీనమైన పోస్టింగ్స్ చేస్తూ పైచాచిక ఆనందం పొందుతున్నది. అయితే సిఎం కుటుంబంపై కూడా ఇలాంటి పోస్టు చేయడాన్ని టిఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. కౌంటర్లు కూడా పచ్చిగానే పడుతున్నాయి శ్రీరెడ్డికి.‘‘నీకు దగ్గుబాటి వంశస్తుడు లేకుంటే నిద్ర పట్టదు’’ అని కొందరు ఘాటుగా రిప్లై ఇస్తున్నారు.

‘‘నీకు ఎయిడ్స్ రోగం లేకుంటే నిద్ర పట్టదుగా’’ అని మరికొందరు రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. ఎన్నికల ముందు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మీద శ్రీరెడ్డి తీవ్రమైన ఆరోపణలు గుప్పించింది. జీవన్ రెడ్డి పార్క హయత్ హోటల్ లో అమ్మాయిలతో గడుపుతాడని విమర్శలు గుప్పించింది. తనను కూడా రమ్మని చాలాసార్లు వేధించాడని ఆరోపించింది. అయితే తాను జీవన్ రెడ్డితో గడపలేదని తేల్చి చెప్పింది.

తనకు టైం కుదరకలేదని, అందుకే జీవన్ రెడ్డితో గడపలేదని తమిళంలో ఒక టివి ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే జీవన్ రెడ్డి కేటిఆర్ కు అత్యంత సన్నిహితుడు అన్న చర్చ ఉంది. జీవన్ రెడ్డి మీద విమర్శలు వచ్చినా సరే తిరిగి ఆయనకే ఆర్మూరు టికెట్ ఇచ్చారు కేసిఆర్. దీంతో జీవన్ రెడ్డి మీద విమర్శలు చేసినా పట్టించుకోలేదన్న కోపంతోనే శ్రీరెడ్డి ఏకంగా సిఎం ఫ్యామిలీ మీద అగ్లీ కామెంట్స్ చేసిందన్న విమర్శలున్నాయి.

<iframe src=”https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Fiamsrireddy%2Fposts%2F2267517293495190&width=500″ width=”500″ height=”192″ style=”border:none;overflow:hidden” scrolling=”no” frameborder=”0″ allowTransparency=”true” allow=”encrypted-media”></iframe>