కెటియార్ సిరిసిల్ల రికార్డు ఇదే

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెశిడెంటు గా నియమితుడయిన కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్ల  నియోజకవర్గం నుంచి అసెంబ్లీ కి ఎంపికైన సంగతి తెలిసిందే. 

అయితే, ఆయన సిరిసిల్ల ఎన్నిక మామూలు ఎన్నిక కాదు, అది  ఒక రికార్డు.సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఆయన అసెంబ్లీకి ఎన్నికవడం ఇది నాలుగో సారి. ఇది అసాధారణమయిన ఎన్నిక అందుకే సరికొత్త రికార్డు.  కెటియార్ కంచుకోటగా మారిన సిరిసిల్ల   దేశంలోని విఐపి నియోజకవర్గాలలో చేరబోతున్నది. ఆయన ముఖ్య మంత్రి కాగానే సిరిసిల్ల దశ తిరుగుతుంది.

సిరిసిల్ల నియోజకవర్గానికి  అసక్తిరమయిన చరిత్ర ఉంది. 1952లో తొలి  ఎన్నిక జరిగినప్పటి నుంచి  నియోజకవర్గం నుంచి హేమాహేమీలు అసెంబ్లీకి గెలుపొందారు. అందులో కూడా ఒకటికంటే ఎక్కువ సార్లు గెలుపొందిన వారు ఉన్నారు. అయితే, కెటియార్ ఎన్నిక మాత్రం భిన్నమైంది. అయిన నాలుగుసార్లు వరుసగా గెలుపొందారు. తెలంగాణలో  ఇంత చిన్నవయసులో నాలుగు సార్లు ఒకే నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు గెలుపొందిన వాళ్లెవరైనా ఉంటే అందులో కెటియార్ ఒకరు.

1952 లో ఈ నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఒకరు జనరల్ జోగన పల్లి ఆనందరావు. రెండో వ్యక్తి ఎస్ సి రిజర్వుడు రాజమణి దేవి. అపుడు కాంగ్రెస్ వోడిపోయింది. ఇందులో ఆనందరావు పిడిఎఫ్ అభ్యర్థి అయితే, రాజమణి దేవి ఎస్ సిఎఫ్ అభ్యర్థి. నిజానికి  సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గం కానే కాదు, 1952 నుంచి ఇప్పటి దాకా జరిగిన ఎన్నికల్లోకాంగ్రెస్  గెలిచింది కేవలం మూడంటే మూడుసార్లే. ఇందులో ఒక్క సారి కూడా ఈ పార్టీ రెండు సార్లు వరుసగా గెలుపొందలేదు.

గతంలో  సిరిసిల్ల నియోజకవర్గం నుంచి  చెన్నమనేని రాజేశ్వరరావు అయిదు సార్లు గెలుపొందారు. కమ్యూని స్టు యోధుడయిన సిహెచ్ రాజేశ్వరరావు కూడా  ఒకే పార్టీనుంచి  వరుసగా   గొలుపొందలేదు.  నిజానికి ఆయన కూడా వరసగా రెండు సార్లు ఎపుడూ గెలుపొందలేదు. మొదటి  నాలుగు సార్లు  ఆయన సిపిఐ తరఫున నిలబడి గెలిచారు.తర్వాత తెలుగుదేశం పార్టీలోచేరారు. మొదటి సారి ఆయన సిపిఐ అభ్యర్థిగా 1967లో 8332 ఓట్ల అధిక్యతతో గెలుపొందారు. ఆతర్వాత 1978, 1985,1994 లో సిపిఐ తరఫునే గెలిచారు. 1985లో ఆయన 23 వేల పైబడి మెజారిటీ వచ్చింది. 2004లో ఆయన తెలుగుదేశం తరఫున పోటీ చేశారు.  17008 వోట్ల మెజారిటీతో గెలుపొందారు.

ఆ తర్వాత  జువ్వాడి నర్సింగరావు కాంగ్రెస్ తరఫున రెండు సార్లు గెలుపోందారు. మొదటి సారి 1962లో 9 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రెండో సారి ఆయన 1972లో 2686 ఓట్లతో చెన్నమనేని రాజేశర్వరావు (సిపిఐ)ని ఓడించి రాజేశ్వరరావు వరుసగా రెండుసార్లు గెలిచి రికార్డు సృష్టించకుండా అడ్డుకున్నారు.

ఇపుడు కెటియార్ కొత్త చరిత్ర రాశారు. ఆయన వరుసగా రెండు సార్లు గెలుపొందిన తొలి సిరిసిల్ల ఎమ్మెల్యే అయ్యారు. అంతేకాదు, వరుసగా నాలుగుసార్లు గెలిచిన ఎమ్మెల్యుకూడా ఆయనే.ఇక ఆయన సాధించాల్సిన రికార్డు ఒక్కటే. అయిదోసారి గెలవాలి. అపుడు చెన్నమనేని రికార్డు అధిగమిస్తారు.అదేమంత పనికాదు.