తెలంగాణ సీఎం కేసీఆర్ పెద్ద సాహసానికి తెరతీశారు. అదే గ్రేటర్ ఎన్నికలను అనుకున్న సమయానికి జరపడం. మొదట్లో మున్సిపల్ ఎన్నికలను డిసెంబరులోనే నిర్వహించాలని అనుకున్నారు. ఆ మేరకు సర్వే చేయించుకుని తమకు 100 సీట్లు ఖాయమునే నిర్ణయానికి వచ్చారు. కానీ అనూహ్యంగా హైదరాబాద్ నగరాన్ని వరదలు ముంచెత్తడంతో సర్వేలు కూడ నీళ్లపాలయ్యాయి. ప్రభుత్వం మీద వ్యతిరేకత పుట్టుకొచ్చింది. వరదలతో సినీ మొత్తం అల్లకల్లోలం కావడం, పదుల సంఖ్యలో మరణాలు సంభవించడంతో తెరాస పాలనా మీదే పెద్ద మచ్చపడినట్లయ్యింది. ప్రజలు కూడ తెరాస నాయకులను ఫేస్ టూ ఫేస్ కడిగేశారు. విపక్షాలు ఈ పరిస్థితిని బాగా వాడుకుని అధికార పక్షం మీద వ్యతిరేకతను మరింతగా పెంచాయి.
పైగా దుబ్బాక ఉప ఎన్నికల్లో తెరాస ఓడిపోవడంతో గ్రేటర్ ఓటర్లలో సైతం పార్టీ మీదున్న ఇమేజ్ తగ్గింది. ఇవన్నీ ఊహించని ప్రతికూలతలే. వీటి నడుమ ఎన్నికలకు వెళితే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ ఎన్నికలను కన్నవారికి వాయిదావేద్దామని అనుకున్నారు. ఈ రెండు నెలలో ఏదో ఒకటి చేసి ప్రజలను ఆకట్టుకోవాలని అనుకున్నారు. కానీ ఏమనుకున్నారో ఏమో కానీ ఉన్నట్టుండి ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. 18 నుండి 20 వరకు నామినేష్లలు, డిసెంబర్ 1న పోలింగ్, డిసెంబర్ 4న కౌంటింగ్ అంటూ షెడ్యూల్ వదిలేశారు.
ఊహించని ఈ పరిణామంతో ప్రతిపక్షాలు కాస్త షాకయ్యాయి. వరదలు, దుబ్బాక ఓటమి లాంటి దెబ్బలతో కేసీఆర్ వెనక్కు తగ్గుతారని అనుకుంటే ఆయన దూకుడుగా వెళ్లడం ప్రజల్ని సైతం విస్మయానికి గురిచేస్తోంది. కేసీఆర్ ఇంతటి రిస్కీ డెసిషన్ తీసుకోవడానికి ప్రధాన కారణం పార్టీని తిరిగి పూర్వపు పరిస్థితులకు తీసుకురావాలని అనుకోవడమే. దుబ్బాక ఫలితాలతో కేసీఆర్ పని అయిపోయిందని, తెరాస కోలుకోవడం కష్టమని, గ్రేటర్ ఎన్నికల్లో కూడ కుప్పకూలిపోతుందనే వదంతులు పుట్టుకొచ్చాయి. ఇవి ఇలాగే కొనసాగితే పార్టీ మీదున్న నెగెటివ్ ప్రచారమే నిజమవుతుంది. ఆ పరిస్థితులు రాకమునుపే ఎన్నికలకు వెళ్లి తమ స్టామినా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.
ఈ వ్యూహం గనుక ఫలిస్తే తెరాస మళ్ళీ పాత పరిస్థితులకు వచ్ఛే ఆవకాశం ఉంది. అలా కాకుండా జనంలో వ్యతిరేకత ఉన్నమటే నిజమైతే మాత్రం పార్టీ దారుణంగా దెబ్బతిట్టుంది. దుబ్బాక ఎన్నికల ఫలితాలు ఓటర్ల మీద ఎఫెక్ట్ చూపిస్తే మొత్తానికి గ్రేటర్ పీఠాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అప్పుడిక కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమితం కావాల్సిందే.