తెలంగాణ కాంగ్రెస్ కు మరో ఝలక్. రాపోలు రాజీనామా

కాంగ్రెస్ మాజీ రాజ్య సభ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.  తన పట్ల పార్టీలో నిర్లక్ష్య వైఖరి కొనసాగుతోందని విధేయులను మరిచి పార్టీ ఏక పక్షంగా వ్యవరిస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

  రాహుల్ నాయకత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎదిగే సూచనలు కనిపించటంలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి వాతావరణంలో ఉండలేక తాను రాజీామాన చేస్తున్నట్లు ఆయన చెప్పారు.  రాహుల్ గాంధీకి రాజీనామా లేఖ పంపారు. ఏపార్టీలో చేరతానని ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. ఈ సాయంకాలం  ఆయన అధికారికంగా తన రాజీనామాను ప్రకటిస్తారు. తను బయటకు వెళ్లేందుకు దారి తీసిన పరిస్థితులను వివరిస్తారు.

రాపోలు జర్నలిస్టు గా చాలా కాలం పనిచేశారు. డిశ్రీనివాస్ పిసిసి అధ్యక్షుడి ఉన్నపుడు ఆయన సలహాదారుగా ఉన్నారు. అపుడే పిసిసి ప్రధాన కార్యదర్శి అయ్యారు. పార్టీకి కార్యాలయంలో బాగా చాకిరీ చేశారు. బిసి కుటుంబానికి చెందిన ఆయనకు రాజ్యసభ సభ్యత్వం లభించింది. నిజమయిన కాంగ్రెస్ వాదిగా ఆయన ఉండే ప్రయత్నం చేశారు.పైసల్లేవు బొత్తిగా. అలాంటి వాళ్లకు కాంగ్రెస్ లోనే కాదు, ఏ పార్టీలోనూ ఏం చోటుంటుంది.