ఎన్నికలు జరిగితే తెలంగాణలో ఆ పార్టీదే గెలుపా.. ఆత్మసాక్షి సర్వేలో ఏం తేలిందంటే?

రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి చాలా సమయం ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫీవర్ ఇప్పటికే మొదలైంది. ‘ఆత్మసాక్షి’ గ్రూప్‌ తాజాగా సర్వే చేయగా రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆ సర్వేలో వెల్లడైంది.తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆత్మసాక్షి గ్రూప్ సర్వే చేసి ఈ విషయాలను వెల్లడించడం గమనార్హం. ‘ఆత్మసాక్షి’ గ్రూప్‌ సర్వే ప్రకారం టీఆర్ఎస్ కు 56 నుంచి 59 స్థానాలు రానున్నాయి.

ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ 31.5 శాతం ఓట్లతో 37 నుంచి 39 శాతం ఓట్లను సాధించే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది. భారతీయ జనతా పార్టీకి మాత్రం 14 నుంచి 16 సీట్లు వస్తాయని ఈ పార్టీకి 21 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలింది. ఆత్మసాక్షి గ్రూప్ సర్వేపై ప్రజల్లో కూడా మంచి అభిప్రాయం ఉండటంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ విధంగానే ఉండే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.

టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో పుంజుకునే దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశం అయితే ఉండగా మజ్లిస్ కు 2.75 శాతం ఓట్లు, ఇతరులకు 3.25 శాతం ఓట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 1,88,000 శాంపిళ్లతో ఈ సర్వే జరిగిందని సమాచారం అందుతోంది.

గతంలో ఈ సంస్థ 18 రాష్ట్రాలలో సర్వేలు నిర్వహించగా 16 రాష్ట్రాల్లో సర్వేలో పేర్కొన్న ఫలితాలు రిపీట్ కావడం గమనార్హం. దళిత బంధు పథకం టీఆర్ఎస్ ప్రభుత్వానికి మైనస్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకాన్ని సరిగ్గా అమలు చేయకపోవడంతో దళితులు టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్నారని సమాచారం అందుతోంది. ఆత్మసాక్షి గ్రూప్ నియోజకవర్గాల వారీగా సర్వే చేసి సర్వే ఫలితాలను వెల్లడించడం గమనార్హం.