కాంగ్రెస్ పీపుల్స్ మ్యానిఫెస్టో విడుదల

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీపుల్స్ మ్యానిఫేస్టోను విడుదల చేసింది. ఉత్తమ్, కుంతియా, ఇతర కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో ఈ మ్యానిఫేస్టోను విడుదల చేశారు. మ్యానిఫేస్టో వివరాలను టిపిసిసి అధికార ప్రతినిధి దాసోజ్ శ్రావణ్ వెల్లడించారు. సుపరిపాలనకు కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట వేస్తుందని తెలిపారు. మ్యానిఫేస్టోలో ముఖ్యాంశాలు ఏంటంటే…  

 

సీఎం ,మంత్రుల ,అధికారులను లోకా యుక్త కిందకు తీసుకువస్తాం

పారదర్శక పాలనకు ప్రత్యేక గ్రీవెన్సెస్ సెల్ ఏర్పాటు

టీఎస్ కు బదులు టీజీ గా మార్చుతాం

ఉద్యమకారుల కుటుంబానికి 10 లక్షలు ,సామాజిక గౌరవం ఇస్తాం

మూడునెలల్లో ఉద్యమకారులపై కేసులను ఎత్తేస్తాం

ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ

పెట్టుబడి సహాయాన్ని కొనసాగించి ..రైతు కూలీలకు  కూడా వర్తింపచేస్తాం

17 పంటలకు మద్దతు ధర

నిరుద్యోగులకు 3000 నిరుద్యోగ భృతి

ఏడాదిలో లక్ష ఉద్యోగాలను భర్తీ

20 వేల టీచర్ ఉద్యోగాల భర్తీకి మెగా డిఎస్సి

నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి ..మండలానికి 30 పడకల ఆసుపత్రి

ఇండ్ల నిర్మాణానికి 5లక్షలు

ఇందిరమ్మ ఇండ్ల బకాయిలు చెల్లిస్తాం ..అదనపు గది కోసం రెండు లక్షలు ఇస్తాం

ఎస్సిల్లో మూడు కార్పొరేషన్ లు … మాదిగ ,మాల ,మాదిగ ఉపకులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్ లు ఏర్పాటు

ఎస్టీలకు కూడా మూడు కార్పొరేషన్ లు

దామాషా ప్రకారం రిజర్వేషన్ లు

ఎస్టీ ల భూములకు 1970 భూ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తాం

 ఇమామ్ లకు 6 వేల గౌరవ వేతనం

 వక్ఫ్ బోర్డు లకు జ్యూడిషియల్ అధికారాలు కల్పిస్తాం

ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేస్తాం

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు రిజర్వేషన్ లు

సిపిఎస్ ను రద్దుచేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేస్తాం

పిఆర్ సీ ,ఐఆర్ లను అమలుచేస్తాం

ఆరు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం ..

విద్యకు రాష్ట్ర ఆదాయంలో 20శాతం కేటాయిస్తాం

పాల సేకరకరణకు ఐదు రూపాయల ఇన్సెంటివ్ అందిస్తాం

సీనియర్ సిటిజెన్స్ కు బస్సు ప్రయాణంలో యాభై స్ధాతం రాయితీ ఇస్తాం    

ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా అమలు చేస్తామని నేతలు తెలిపారు.