కర్నాటక లోక్ సభ ఎన్నికల్లో కెసియార్ వీరాభిమాని పోటీ

తమిళనాడు రైతాంగం తరఫున, జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యకు వ్యతిరేకంగా పోరాడుతున్న సినీ నటుడు ప్రకాశ్ రాజ్ 2019 లో క్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే ఒక రాజకీయ పార్టీ తరఫున కాకుండా, ఇండిపెండెంటుగా పోటీ చేస్తారు. ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేసేది తర్వాత వెల్లడిస్తారు. ఎన్నికల్లో పోటీ చేయాలన్న తన నిర్ణయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా అభిమానులకు షేర్ చేశారు. దేశంలో కాంగ్రెస్ బిజెపి ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తున్నవారిలో ప్రకాశ్ రాజ్ ఒకరు. ఈ   రాష్ట్రాల్లో పార్టీ లన్నీ ఏదో ఒక జాతీయ పార్టీతో కలసి మెలసి ఉండాలనుకుంటున్నందునే ఆయన ఇండిపెండెంటుగా పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిసింది.  కెసియార్ ఫెడరల్ ఫ్రంటు పట్ల ఆసక్తిరేకెత్తించింది అది జాతీయ రాజకీయ పార్టీలకు వ్యతిరేకం అని ప్రకటించడమే.

 

ప్రకాశ్ రాజ్ తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్ అభిమాని. కెసియార్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన ను ప్రకటించగానే కలుసుకుని మద్దతు ప్రకటించిన సినీ నటుడు ఆయనే. 2018 మార్చి నెలలో ఆయన కెసియార్ ను కలుసుకుని కాంగ్రెస్ వ్యతిరేక, బిజెపి వ్యతిరేక ఫెడరల్ ఫ్రంటు గురించి చర్చంచారు. కెసియార్ అంటే తనకు చాలా గౌరవమని కూడా ఆయన చెప్పారు.

ఈ మధ్య కాలంలో ఆయన అనేక సాంఘిక సమస్య ల మీద గొంతెత్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని పోరాడుతున్న తమిళ రైతుల పక్షాన నిలబడ్డారు. రైతుల కోసం ఆయన ప్రతినిధుల బృందాలను కూడా ఢిల్లీ తీసుకెళ్లారు. తన స్నే హితురాలు, జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య తర్వాత ఆయన మరీ యాక్టివ్ అయ్యరు. బిజెపి , మోదీ విధాలను విమర్శస్తున్నారు. 2018లో ఆయన ‘నేను మోదీ వ్యతిరేకిని, అనంత కుమార్ వ్యతిరేకిని, అమిత్ షా వ్యతిరేకిని యోగి ఆదిత్యనాథ్ వ్యతిరేకిని,’ అని నిర్ద్వంద్వంగా ప్రకటించారు. #JustAsking హ్యాష్ టాగ్ పేరుతో ఆయన బిజేపి విధానాలకు వ్యతిరేకంగా ట్విట్టర్ క్యాంపెయిన్ నడిపారు. ఇదే విధంగా కర్నాటక యువ మోర్చ కూడా ఆయన మీద యుద్ధం ప్రకటించింది. ఉత్తర కన్నడ జిల్లాలో ప్రకాశ్ రాజ్ ప్రసంగించిన స్టేజీ గోమూత్రంతో యువమోర్చ కార్యకర్తలు శుద్ది చేశారు. దక్షిణ భారత దేశంనుంచి ఇంతగా ఐడియలాజికల్ గా బిజెపితో పోరాడిన సినిమా నటులెవరూ లేరు?

ప్రస్తుత రాజకీయాల మీద చాలా ఆయనకు చాలా స్పష్టమయిన అభిప్రాయాలున్నాయి. కర్నాటక, తమిళనాడుల మధ్య చెలరేగుతున్న కావేరీ జల వివాదం గురించి మాట్లాడుతూ, ఈ సమస్యకు పరిష్కారం లేక కాదు, పరిష్కారం ఉంది. రాజకీయ పార్టీలు స్వార్థ ప్రయోజనాలతో పరిష్కారాన్ని వాయిదా వేస్తున్నారని ప్రకటించారు.