Pawan Kalyan: టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తూనే మరొకవైపు వరసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు రాజకీయాలలో డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తూ బిజీ బిజీగా గడిపిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలకు కాస్త గ్యాప్ ఇచ్చి తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ అంత పెద్ద హోదాలో ఉన్న స్టార్ హీరో అయినా కూడా ఎప్పుడూ చాలా సింపుల్ గా కనిపిస్తూ ఉంటారు.
తెల్లటి దుస్తులు ధరించి చాలా సింప్లిసిటీ గా ఉంటారు. ఇతర హీరోలు రాజకీయ నాయకులతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ చాలా సింపుల్ గా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇది ఇలా ఉంటే ఇటీవల హరిహర వీరమల్లు సినిమాను పవన్ పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చిన పవన్ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసింది. తర్వాత తమిళనాడులో మురగ భక్తర్గల్ మానాడు సభ కోసం వెళ్ళిన పవన్ అక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ముఖ్యంగా ఆయన లుక్ అందరినీ ఆకట్టుకుంది.
వైట్ అండ్ వైట్లో పవన్ కళ్యాణ్ పంచె కట్టుతో బ్యాక్గ్రౌండ్ లో చార్టెడ్ ఫ్లైట్ నుంచి బయటకు వస్తూ చాలా స్టైలిష్ గా తన మార్క్ స్పాగ్ తో కనిపించడం చూసి అభిమానులు మరింత ఎక్సైటింగ్ అవుతున్నారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి పవన్ కళ్యాణ్ చెప్పుల మీద పడింది. చెప్పుల ధర ఆన్లైన్లో పరిశీలించగా వీటి ధర సుమారుగా రూ.7,085 అని తెలిసి కొంతమంది ఆశ్చర్యపోయినా మరి కొంతమంది ఏమో పవన్ రేంజ్ కి ఇవి తక్కువే అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి అయితే మానాడు సభలో పవన్ కళ్యాణ్ చెప్పులు అందరి దృష్టిని ఆకర్షించాయని చెప్పవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ ఇతర హీరోలతో పోల్చుకుంటే చాలా మేలు కొంతమంది చెప్పులు షూస్ కోసం ఏకంగా లక్షలకు లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు అని కామెంట్ చేస్తున్నారు.