Rashmika: నేషనల్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు సౌత్ సినిమాలకు కమిట్ అవుతూ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అదే విధంగా వరుస బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా రష్మిక ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఒక్కో సినిమాకు సుమారు నాలుగు నుంచి 8 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటూ కెరియర్ పరంగా పీక్ స్టేజ్ లో ఉన్నారని చెప్పాలి.
ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచే సక్సెస్ అందుకున్న రష్మిక తన జీవితాన్ని కూడా అంతే విలాసవంతంగా గడుపుతూ ఉన్నారు. ఇప్పటికే ఈమె పలుచోట్ల విలాసవంతమైన భవనాలు కొనుగోలు చేశారు. అలాగే ఖరీదైన కార్లను కూడా కొనుగోలు చేశారు. అయితే ఇటీవల కాలంలో రష్మిక ఖరీదైన హై ఎండ్ కారులో రష్మిక షికార్లు కొడుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇలా రష్మిక కొనుగోలు చేసిన ఈ కొత్త కారు గురించి పలు విషయాలు బయటకు రావడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. మెర్సీడేస్ బెంజ్ S -450 మోడల్ కారును రష్మిక కొనుగోలు చేశారు. ఈ కారు ఖరీదు సుమారు రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం.అయితే ఈ ఖరీదైన కారులో రష్మిక తెగ ఎంజాయ్ చేస్తూ తిరుగుతోందట. ఇప్పటికే రష్మిక వద్ద కూడా 5 లగ్జరీ కారులు కూడా ఉన్నాయి. కేవలం ఈ కార్ల కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈమె సికిందర్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా రంజాన్ పండుగను పురస్కరించుకొని ఈ నెల 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు పలు బాలీవుడ్ సినిమాలకు అలాగే కుబేర సినిమాలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.