Mahesh Babu: టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ పెళ్లి తాజాగా జరిగిన విషయం తెలిసిందే. జైనబ్ రవ్జీ మెడలో జూన్ 6న తెల్లవారుజామున 3 గంటల సమయంలో అఖిల్ మూడు ముళ్లు వేశాడు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో నాగార్జున నివాసంలో వీరి వివాహం జరిగింది. అతి వీరి పెళ్లి వేడుకకు కేవలం అతికొద్ది మంది బంధువులు, స్నేహితులు, సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇకపోతే ఆదివారం అనగా జూన్ 8న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో రిసెప్షన్ వేడుకను గ్రాండ్ గా నిర్వహించారు.
ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆయన బార్య నమ్రత, కూతురు సితారతో కలిసి హాజరయ్యారు. అయితే ఎప్పటి లాగే మహేశ్ బాబు చాలా సింపుల్ గా, స్టైలిష్ గా కనిపించారు. అయితే ఇప్పుడు ఆయన ధరించిన టీ షర్ట్ సింపుక్ గా ఉన్నా కూడా చాలా స్టైలిష్ గా కనిపించడంతో దాని ధరను వెతికే పనిలో పడ్డారు అభిమానులు. కాగా మహేష్ బాబు ధరించిన ఆ టీ షర్ట్ ప్రముఖ లగ్జరీ బ్రాండ్ హెర్మ్స్ కు చెందింగా తెలుస్తోంది.
అయితే దీని ధర తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు. దీని ధర అక్షరాల రూ.1.51లక్షలుగా ఉంది. ఇంకా వివరంగా చెప్పాలంటే రూ.1,51,678 అట. ఈ విషయం తెలిసి అంత సింపుల్ గా ఉన్న టీ షర్ట్ ఏకంగా అన్ని లక్షల బాబోయ్ అంటూ షాక్ అవుతున్నారు. ఇకపోతే మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. మహేశ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్నారు. మహేశ్ కెరీర్ లో 29 మూవీగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.