ఇక అంగారకుడి లోగుట్టు బయటపడుతుంది (వీడియో)

అంగారకుడి లోగుట్టు బయటపెట్టేందుకు అమెరికా (నాసా) ప్రయోగించిన ఇన్సైట్ ల్యాండర్ పని మొదలు పెట్టింది. అంగారకుడి మీదకు మనుషుల్ని పంపించడానికి ముందు అతగాడి లోగొట్టునంతా తెలుసుకునేందుకు నాసా ఇన్ సైట్ ల్యాండర్ ని పంపించింది.

ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఇన్సైట్ యాత్ర నవంబర్ 26న సురక్షితంగా గ్రహంమీద కాలుమోపడంతో ముగిసింది. ల్యాండింగ్ ఫెయిలతే కోట్లాది డార్ల ఖర్చుతో చేపట్టిన ఒక బహత్తర ప్రయోగానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలేది.

అంగారకుడి మీద సేఫ్ గా నిలబడ్డాక నాసా శాస్త్రవేత్తలు చెప్పిన పనులన్నింటిని ఇన్సైట్ చక్కగా బుద్ధిగా చేస్తున్నది. ఇన్ సైట్ ను అంగారకుడికి మీదికి పంపించిన లక్ష్యాలలో ఒకటి డిసెంబర్ 19 విజయవంతంగా పూర్తయింది. అంగారక పరిశోధనలో అదొక మైలురాయి. నాసా శాస్త్రవేత్తలు పండగ చేసుకున్నారు.

 

అంగారకుడి మీద దిగాక ఇన్ సైట్ అక్కడి పరిసరాల మీద చక్కటి పోటోలు పంపించింది. అంతేకాదు, తన సెల్పీని కూడా పంపించింది.

ఇన్ సైట్ ల్యాండర్ సెల్ఫీ

తర్వాత డిసెంబర్ 19వ తేదీన ఈ ప్రయోగాలలో అతి ముఖ్యమయిన సెస్మోమీటర్ ని అక్కడి భూమ్మీద పాతింది. రాగిరంగులో ఉన్న ఈ సెస్మోమీటర్ అంగారకుడి సంజవెలుగులో నిగనిగలాడటం బ్యానర్ ఫోటోలో కనిపిస్తుంది.

 

సెస్మోమీటర్ని నిలబెట్టడంలో ఇన్ సైట్ విజయవంతం కావడంతో తామనుకున్న దానికంటే అక్కడ పనులు చక్కగా సాగుతున్నాయని ఇన్ సైట్ ప్రాజక్టు మేనేజర్ టామ్ హాఫ్ మన్ అన్నారు. ఇది ఇన్ సైట్ మనకిచ్చిన క్రిస్ట్ మస్ గిఫ్ట్ అని సంతోషిస్తున్నారు.

ఈ సెస్మో మీటర్ ను సెస్మిక్ ఎక్స్ పిరిమెంట్ ఫర్ ఇంటీరియర్ స్ట్రక్చర్ SEIS అని కూడా పిలుస్తారు. సెస్మో మీటర్ ఏర్పాటుచేసే ముందు ల్యాండర్ చుట్టు ఉన్న అంగారకుడి నేలను కూడా పరిశీలించాల్సి వచ్చింది. ఒక రొబోటిక్ చేయి ఈపని చేసిపెట్టింది. అక్కడ సెస్మోమీటర్ నిలబెట్టేందుకు అనువైన జాగా ఏదో కూడా అది వెదికి పెట్టింది.

 

జాగా చూసి పెట్టమని డిసెంబర్ 18 అంటే మంగళవారం నాడు ఇన్ సైట్ ఇంజనీర్లు ఇన్ సైట్ కు కమాండ్స్ పంపించారు. అక్కడి నుంచి ఒకె సమాధానం వచ్చిన తర్వాత డిసెంబర్ 19న ల్యాండర్ ఎందురుగా చేయిచాస్తే అందేంత దూరంలో అంటే 5.367 అడుగుల దూరాన సెస్మోమీటర్ ను నిలబెట్టారు. దీనితో ఒక ముఖ్యమయిన ఘట్టం పూర్తయింది. ఇన్ సైట్ ను పంపే లక్ష్యాలో 75 శాతం పూర్తి చేసేందుకు సెస్మోమీటర్ సహాయం అవసరం.

సెస్మోమీటర్ అంగారక ప్రకంపనాలను, భూమిలోపల ఫలకాల కదలికలను పరిశీలిస్తుంది. అంగారకుడి మీద వచ్చే అతి భూకపంప ఒక ఫ్లాష్ బల్బ్ పనిచేసి భూరహస్యాలను వెల్లడిస్తుంది.

’అంగాకరకుడి మీద సెస్మోమీటర్ ని నిలబెట్టడమంటే ఫోన్ ని చెవికి ఆనించడం లాంటిది.ఈ పని పూర్తికావడంతో మేమ్ థ్రిల్ అయిపోయాం. దీనితో అంగాకరికుడి లోగట్టు తెలిసిపోతుంది. అంగారకుడి ఉపరితలం కింది నుంచే కాదు అంగారక భూగర్భం నుంచి వచ్చే ధ్వనులన్నంటిని మేం ఇపుడు వినగలం,’ అంటున్నారు ఎస్ ఇ ఐఎస్ ప్రిన్సిపాల్ ఇన్వెస్టిగేటర్ ఫిలిప్ లాగనోన్.