భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఆధార్ గుర్తింపు ఎంతో అవసరం. పెద్దవారికి మాత్రమే కాకుండా పుట్టిన పిల్లలకు కూడా ఆధార్ కార్డు ఎంతో కీలకంగా మారనుంది.ఇక పెద్దవారికి మనం ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి స్కీం పొందాలన్నా తప్పనిసరిగా ఆధార్ కార్డు అవసరమవుతుంది. అలాగే ఏ ఇతర కార్యకలాపాలను కొనసాగించాలన్న ఆధార్ తప్పనిసరిగా మారింది.అయితే ఆధార్ కార్డు కేవలం పెద్దవారికి మాత్రమే కాకుండా అప్పుడే పుట్టిన బిడ్డలకు కూడా ఆధార్ కార్డు ఇవ్వడం జరుగుతుంది.
అయితే పుట్టిన పిల్లలకు ఆధార్ కార్డు కావాలంటే ఏం చేయాలి? ఎలాంటి సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి? ఎక్కడ ఈ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాలి అనే విషయానికి వస్తే..ప్రభుత్వం సూచించినటువంటి ఆధార్ సెంటర్లలో మనం అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా ఆధార్ కార్డు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలా పిల్లలకు ఇచ్చే ఆధార్ కార్డును బాల ఆధార్ కార్డు అని పిలుస్తారు. పిల్లలకు ఆధార్ కార్డు పొందాలంటే తల్లిదండ్రుల ఆధార్ కార్డును అలాగే పుట్టిన బిడ్డ జనన పత్రాన్ని ప్రూఫ్ గా సమర్పించాల్సి ఉంటుంది.
ఇకపోతే తండ్రి ఫోన్ నెంబర్ అతని ఆధార్ కార్డుకు లింక్ చేయబడి ఉండాలి. పిల్లల ఆధార్ కోసం తండ్రి మొబైల్ ఫోన్ నెంబర్ ఇవ్వడం వల్ల వారి ఫోన్ కి ఓటిపి రావడం జరుగుతుంది ఇలా తల్లిదండ్రుల ఆధార్ కార్డులను అలాగే బిడ్డ పుట్టిన బర్త్ సర్టిఫికెట్ ద్వారా ఆధార్ కార్డు పొందవచ్చు.ఇక బిడ్డ పది సంవత్సరాలయిన తర్వాత మరోసారి ఆధార్ అప్డేట్ చేయించుకోవాలి .ఇలా అప్డేట్ చేసే సమయంలో బిడ్డ ఫింగర్ ప్రింట్ అలాగే బిడ్డ కళ్ళను కూడా స్కాన్ చేసి వారికి ఆధార్ కార్డును జారీ చేయడం జరుగుతుంది.