పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఈ పథకం వరం.. రూ.60 వేల స్కాలర్ షిప్ పొందే అవకాశం?

దేశంలో లక్షల సంఖ్యలో విద్యార్థులు పేదరికం వల్ల లక్ష్యాలను సాధించే విషయంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వాళ్లకు ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో స్కాలర్ షిప్ స్కీమ్స్ అమలవుతుండగా ఆ స్కాలర్ షిప్ స్కీమ్స్ లో విద్యాదాన్ స్కీమ్ కూడా ఒకటని చెప్పవచ్చు. పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా సరోజిని దామోదర్ ఫౌండేషన్ విద్యాదాన్ స్కాలర్ షిప్ లను అమలు చేస్తోంది.

 

సమాజంలో మార్పు రావాలంటే విద్య ముఖ్యమని ఈ ఫౌండేషన్ భావిస్తోంది. 2016 సంవత్సరంలో ఈ స్కాలర్ షిప్ స్కీమ్ మొదలు కాగా ఏకంగా 15 రాష్ట్రాలలో ఈ సంస్థ స్కాలర్ షిప్ స్కీమ్స్ ను అమలు చేస్తుండటం గమనార్హం. గతేడాది ఏపీ నుంచి 250 మంది విద్యార్థులకు ఈ సంస్థ స్కాలర్ షిప్ అందించడం గమనార్హం.

 

https://www.vidyadhan.org/web/index.php వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ స్కాలర్ షిప్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పదో తరగతి మార్కుల సర్టిఫికెట్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, ఇన్ కం సర్టిఫికెట్, జాయిన్ కాబోతున్న హాలీవుడ్ కాలేజ్, ఇతర వివరాలను పొందుపరచడం ద్వారా ఈ స్కాలర్ షిప్ కు అర్హత కలిగే అవకాశం ఉంటుంది.

 

పదో తరగతిలో 90 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2 లక్షల రూపాయల కంటే తక్కువ ఆదాయం ఉన్న కుటుంబానికి చెందిన వాళ్లు ఈ స్కాలర్ షిప్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఇంటర్ చదివే సమయంలో 10,000 రూపాయలు, ఉన్నత విద్యకు 60,000 రూపాయలు స్కాలర్ షిప్ పొందే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.

 

ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకుంటే విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. వెబ్ సైట్ ద్వారా స్కాలర్ షిప్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. జూన్ 30వ తేదీ ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. 9663517131 నంబర్ ద్వారా ఈ స్కాలర్ షిప్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.