రైతులకు అదిరిపోయే శుభవార్త.. రూ.3 లక్షల వరకు రుణాలపై వడ్డీలో రాయితీ!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు మేలు చేసేలా ఎన్నో పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతుల కోసం కేంద్రం కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ను ఇస్తుండగా ఈ కార్డ్స్ ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. మాడిఫైడ్ ఇంటరెస్ట్ సబ్‌వెన్షన్ స్కీమ్ ద్వారా రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

ఈ స్కీమ్ లో భాగంగా రైతులు తీసుకునే రుణాలపై చెల్లించాల్సిన వడ్డీ భారాన్ని ప్రభుత్వమే చెల్లించే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఏడాదికి కూడా మాడిఫైడ్‌ ఇంటరెస్ట్ సబ్‌వెన్షన్ స్కీమ్ ను కొనసాగిస్తామని కేంద్రం వెల్లడించడం గమనార్హం. మాడిఫైడ్‌ ఇంటరెస్ట్ సబ్‌వెన్షన్ స్కీమ్ రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదని చెప్పవచ్చు.

రైతులపై వడ్డీ భారం తగ్గించే దిశగా కేంద్రం అడుగులు పడుతుండటం కొసమెరుపు. పాడిపరిశ్రమ, చేపల పెంపకం, తేనెటీగల పెంపకంతో పాటు పశుసంవర్ధకం, ఆర్బీఐ పంటల సాగు కోసం రుణం తీసుకునే వాళ్లకు 3 లక్షల రూపాయల వరకు తీసుకునే రుణంపై వడ్డీ రూపంలో రాయితీ లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

బ్యాంకులతో లింక్ అయిన ప్రైమరీ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీస్ మాత్రమే ఈ వడ్డీ రాయితీని పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఒక సంవత్సరం మాత్రమే వడ్డీలో రాయితీ పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ప్రస్తుతం రైతులకు లెండింగ్ రేటు 7 శాతంగా ఉండగా ఇందులో 1.5 శాతం వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పవచ్చు.