దీపావళి రోజున ఈ జంతువుల చూస్తే చాలు అంతా శుభమే?

హిందూ ధర్మంలో పురాతన కాలం నుండి పండుగలకు ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రతి పండుగను ప్రజలందరూ ఎంతో ఆనందంగా నియమ నిష్ఠలతో జరుపుకుంటారు. అలాగే దీపావళి పండుగను కూడా ప్రజలందరూ కులమత బేధాలు లేకుండా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ప్రపంచానికి పట్టిన నరకాసురిడి పీడ వదిలినందుకు ప్రజలు దీపాలు వెలిగించి ఆనందంగా పండగను జరుపుకున్నారు. అప్పటినుండి ప్రతి ఏడాది నరకాసురుడు బాధలు తొలగిపోయినందుకు ఇలా పండుగ జరుపుకుంటారు. ఈ దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి , గణపతి, విష్ణువుని పూజిస్తారు.

ముఖ్యంగా దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించి కొలువై ఉంటుందని ప్రజల నమ్మకం. అయితే దీపావళి పండుగ రోజున కొన్ని జంతువులను చూడటం వల్ల అదృష్టం వరిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. దీపావళి పండుగ రోజున ఏ జంతువులను చూడటం వల్ల అదృష్టం వరిస్తుందో తెలుసుకుందాం.

• ఆవు: సాధారణంగా ఆవుని గోమాత అని సంబోధిస్తూ ఉంటారు. గోమాతలు కోటి దేవుళ్ళు కొలువై ఉంటారని ప్రజల నమ్మకం. అందువల్ల ప్రతిరోజు గోమాతను పూజించడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయని ప్రజలు విశ్వసిస్తారు. అలాగే దీపావళి పండుగ రోజున కుంకుమపువ్వు రంగులో ఉన్న ఆవుని దర్శనం చేసుకోవడం వల్ల అదృష్టం వరించి సిరిసంపదలు కలుగుతాయని నమ్మకం.

• పిల్లి : సాధారణంగా ఎక్కడికైనా పయనం అయినప్పుడు పిల్లి ఎదురుపడితే అశుభంగా భావించి ప్రయాణాన్ని కొంత సమయం వాయిదా వేసుకుంటారు. అయితే దీపావళి రోజున పిల్లిని చూడటం వల్ల అదృష్టం వరించి లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుందని నమ్మకం.

• బల్లులు : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం దీపావళి పండుగ రోజున ఇంట్లో బల్లిని చూడడం శుభప్రదంగా భావిస్తారు. పండుగ రోజున ఇంట్లో బల్లి కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహానికి శుభ సూచికగా చెప్పవచ్చు.

• గుడ్లగూబ : లక్ష్మీదేవి వాహనమైన గుడ్లగూబని దీపావళి పండుగ రోజున చూడటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది అదృష్టం వరిస్తుందని నమ్మకం. అలాగే దీపావళి రోజున గుడ్లగూబని చూడటం వల్ల శుభప్రదంగా కూడా భావిస్తారు.