మీ ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా.. ఈ చిట్కాలు పాటిస్తే బల్లులు పరార్!

ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉంటే, వాటిని తరిమికొట్టడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. గోడలపై పగుళ్లు ఉంటే మూసివేయడం, వెల్లుల్లి, మిరియాల పొడి వాసనను ఉపయోగించడం, నెమలి ఈకలను ఉంచడం, దోమతెరలు వాడడం వంటివి బల్లులను నివారించడానికి ఉపయోగపడతాయని చెప్పవచ్చు. బల్లులు గోడల పగుళ్ల ద్వారా ఇంట్లోకి వస్తాయి, కాబట్టి వాటిని మూసివేయడం ద్వారా సమస్యకు సులువుగానే చెక్ పెట్టవచ్చు.

వెల్లుల్లి రెబ్బలను గోడల చుట్టూ ఉంచడం ద్వారా బల్లులు అక్కడి నుండి వెళ్ళిపోతాయని చెప్పవచ్చు. మిరియాల పొడిని నీటిలో కలిపి, ఆ ద్రావణాన్ని బల్లులు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో పిచికారి చేయడం ద్వారా బల్లులు శాశ్వతంగా దూరమవుతాయి. నెమలి ఈకలను ఇంటి గోడలకు అతికించడం ద్వారా బల్లులు రాకుండా చేయవచ్చు. తలుపులు, కిటికీలు, వెంటిలేటర్లకు దోమతెరలు అమర్చడం ద్వారా కూడా బల్లుల సమస్య దూరమయ్యే ఛాన్స్ ఉంటుంది.

లవంగం, పుదీనా, బంతి, లావెండర్ వంటి మొక్కలు బల్లులను తరిమికొట్టడంలో సహాయపడతాయి. కొంచెం కాఫీని, పొగాకుతో కలిపి చిన్న చిన్న బాల్స్ గా చేసి ఇంటి మూలల్లో ఉంచడం ద్వారా బల్లుల బెడద తగ్గే అవకాశాలు ఉంటాయి. బల్లి కరిస్తే, ఆ ప్రాంతాన్ని శుభ్రమైన నీటితో కడిగి, సబ్బుతో శుభ్రం చేయాలి. ఆపై యాంటీసెప్టిక్ మందు వేయాలి. వదిలించుకోవడానికి మీరు ఉల్లిపాయను కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం, ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి ఇంటి మూలల్లో, ఇవి ఎక్కవుగా తిరిగే ప్రదేశాలలో ఉంచాలి.

మిరియాల పొడిని గోడల మీద స్ప్రే చేయడం ద్వారా బల్లుల సమస్య దూరమవుతుంది. వెల్లుల్లి రెమ్మలను, ఉల్లిపాయ ముక్కలను మూలల్లో ఉంచడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చు. గుడ్ల పెంకుల వాసన కూడా బల్లులకు చెక్ పెట్టడంలో ఎంతగానో సహాయపడుతుంది. పుదీనా మొక్కలు, నాఫ్తలీన్ బాల్స్ కూడా బల్లులకు చెక్ పెట్టడంలో తోడ్పడతాయి.