రఘురామ కాలికి తీవ్రమైన వాపు: వీళ్ళకెలా తెలిసిందబ్బా.?

serious swelling on Raghurama's feet

serious swelling on Raghurama's feet

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, చికిత్స అందుతోన్న సంగతి తెలిసిందే. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం, ఎలాంటి గాయాలూ లేవంటూ నివేదిక వెల్లడయ్యింది. గుంటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఈ మేరకు న్యాయస్థానానికి నివేదిక అందించారు. అయితే, ఆ నివేదిక పట్ల రఘురామ కుటుంబ సభ్యులు చాలా అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చర్మ వ్యాధి కారణంగానే కాళ్ళకు మచ్చలు ఏర్పడ్డాయన్నది ప్రభుత్వ వాదన కాగా, ఏపీ సీఐడీ తనను అదుపులోకి తీసుకున్నాక కొందరు వ్యక్తులు తనను తీవ్రంగా కొట్టడం వల్ల కాళ్ళు వాచిపోయాయని రఘురామ చెబుతున్నారు. ఇక, రఘురామ సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి చేరుకున్నాక.. టీడీపీ అనుకూల మీడియాలో, రఘురామ కాలికి తీవ్రమైన వాపు వుందంటూ కథనాలు షురూ అయ్యాయి. ఆ విషయం టీడీపీ అనుకూల మీడియాకి మాత్రమే ఎలా తెలిసిందన్నది ఇక్కడ కీలకమైన ప్రశ్న.

నిజానికి, రఘురామ కుటుంబ సభ్యులకు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆర్మీ ఆసుపత్రి వర్గాలు కొంత సమాచారం ఇచ్చి వుండొచ్చుగాక. ఆ సమాచారాన్ని టీడీపీ అనుకూల మీడియా సేకరించిందా.? లేదంటే, పరిస్థితిని ముందే ఊహించిందా.? అన్నది తేలాల్సి వుంది. రఘురామకు వైద్య పరీక్షల అనంతరం, ఆ నివేదికను సీల్డ్ కవర్ ద్వారా తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టుకు పంపనున్న సంగతి తెలిసిందే. ఈలోగా రఘురామ ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఊహాగానాలకూ ఆస్కారముండదు. అంత పకడ్బందీగా వ్యవహారలుంటాయి కాబట్టే, సుప్రీంకోర్టు.. ఆర్మీ ఆసుపత్రిలో రఘురామకు వైద్య పరీక్షలు, చికిత్స చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.