పచ్చ మీడియాలో అంతర్యుద్ధం!… ఆ పోస్టే కారణం!?

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పలు పోస్టుల విషయంలో టీడీపీ, జనసేన నేతల మధ్య ఇంటర్నల్ వార్ జరుగుతుందని.. ఈ కారణంతోనే పలు నామినేటెడ్ పోస్టుల విషయంలో బాబు ఇంకా మీనమేషాలు లెక్కేస్తున్నారని అంటున్నారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన, టీడీపీ నేతల మధ్యే కాదు పచ్చ మీడియా అధినేతల మధ్యా ఇంటర్నల్ వార్ మొదలైందనే చర్చ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.

అవును… పచ్చ పత్రికలు, పచ్చ చానళ్లు ఏమిటి అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజానికానికీ ఓ అవగాహన ఉంది. ప్రధానంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ అయితే… తాను పోరాటం చేసేది టీడీపీ, జనసేనతోనే కాదు ఆ పసుపు కరపత్రాలతో కూడా అని నిత్యం విమర్శలు చేసేవారు. ఈ మీడియా కూడా బాబు క్షేమం కోసం ఎంతకైనా తెగిస్తుందని అంటారు.

ఈ నేపథ్యంలోనే ప్రజలను ఏ స్థాయికి దిగైనా ఏమార్చుతారని చెబుతుంటారు. ఫలితంగా తెర వెనుక ఏదో ఒక ప్రయోజనం పొందుతారని వైసీపీ నేతలు విమర్శిస్తుంటారు. ఆ సంగతి అలా ఉంటే… ఆ పచ్చ మీడియాల్లోనే ఒక పత్రిక అధినేత అయితే ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం మీద యాంటీగా వార్తలు రాయడం మొదలుపెట్టారు. దీంతో ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది.

నిత్యం కూటమి ప్రభుత్వానికి భజన చేయడం, ఎన్ని తప్పులు జరుగుతున్నా వెనకేసుకుని రావడం, ఇచ్చిన హామీలు గాలికి వదిలేస్తున్నా లేవనెత్తకపోవడం నిత్యకృత్యంగా పనిచేసే ఆ మీడియా అధిపతి ఇలా ఉన్న పలంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాయడం మొదలుపెట్టారు. దీంతో… చంద్రబాబుకూ ఆ మీడియా అధిపతికీ ఏమైనా చెడిందా అనే చర్చ తెరపైకి వచ్చింది.

అయితే అందుకు గల కారణం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పోస్ట్ అని అంటున్నారు. గత కొన్ని రోజులుగా టీటీడీ చైర్మన్ పదవి రేసులో ఓ మీడియా చానల్ అధిపతి ఉన్నారని.. బాబు ఆయనకు ఇప్పటికే మాట ఇచ్చి, సానుకూలంగా స్పందించారని, సూచనప్రాయంగా ఓకే చెప్పారని అంటున్నారు. అయితే… అదే పోస్టుపై ఈ మీడియా సంస్థ అధినేత కూడా ఆశపెట్టుకున్నారని అంటున్నారు.

దీంతో… ఇప్పటికే ఆ పసుపు ఛానల్స్ లోనే ఓ మీడియా అధినేతకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తానని మాట ఇచ్చేయడంతో.. ఈయనకు నో చెప్పారంట చంద్రబాబు. దీంతో… ఆయన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు రాయడం మొదలుపెట్టారనే టాక్ అటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ, ఇటు మీడియా సర్కిల్స్ లోనూ వినిపిస్తుంది. మరి బాబుకి ఈ విషయంలో ఏమి “రిపోర్ట్స్” వెళ్లాయో, ఫైనల్ గా ఏమి “డిసైడ్” చేయబోతున్నారో వేచి చూడాలి!