టీడీపీ పండుగ మహానాడు రెండు రోజుల పాటు ఆన్ లైన్ జూమ్ యాప్ లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. దీనిలో బాగంగా చంద్రబాబు టీమ్ రకరకాల తీర్మానాలు ప్రవేశ పెట్టింది. వైకాపా ప్రభుత్వాన్ని ఎండగట్టడమే రెండు రోజులు ఎజెండాగా పనిచేసింది. అసలు మే 28 అంటే ఎన్టీఆర్ పుట్టినరోజు. ప్రజలకు పనికొచ్చే కార్యక్రమాలు చేయాలి. కొంచమైనా సామాజిక స్పృహతో వ్యవరించాలి. కానీ పచ్చ తమ్ముళ్లలో ఒకరిలో కూడా ఆ కోణం ఎక్కడా కనిపించలేదు. హాజరైన సీనియర్ నేతలు అంతా జగన్ ఏడాది పాలనపై పడి ఏడిచేవారే. పేదోడి నోటి కాడ కూడి లాగేసుకునే వ్యాఖ్యలే చేసారు తప్ప? మహానాడు వేదికగా ఒక్క మంచిమాట కూడా చెప్పలేదు.
ప్రభుత్వంపై విమర్శలే పనిగా పెట్టుకుని రెండు రోజుల మహానాడుని ముగించారు. అయితే గురువారం మాత్రం చంద్రబాబుకు తమది జాతీయ పార్టీ అని గుర్తొచ్చిందో! ఏమో గానీ కేంద్రానికి అన్ని రకాలు సపోర్ట్ చేస్తామని…భారత్ పై చైనా దూకుడును తీవ్రంగా ఖండిస్తున్నామని…ఈ విషయంలో తమ పార్టీ సపోర్ట్ పూర్తిగా ఉంటుందని చంద్రబాబు అన్నారు. అసవరమైతే తేదాపా కార్యకర్తలు, పార్టీ నేతలే గన్నులు పట్టుకుని చైనా బోర్డర్ లో యుద్ధానికి దిగుతాం అన్న రేంజ్ లో స్పీచ్ ఇచ్చారు. మన భారతేదశం…మన మాతృభూమి అంటూ నాలుగు సినిమా డైలాగులు కొట్టారు. అదృష్టం ఏంటంటే? మహానాడులో ఈ విషయాన్ని తీర్మానించలేదు.
లేదంటే తెలుగు దేశం కార్యకర్తలంతా చైనా బోర్డర్ కి గన్నులు పట్టుకుని వెళ్లాల్సి వచ్చేదంటూ సోషల్ మీడియా వేదికగా జనాలు నవ్వుకుంటున్నారు. అసలు టీడీపీ జాతీయ పార్టీ అని తెలిసిందే చాలా తక్కువ మందికి. ఇప్పుడా ఆ పార్టీ ఏపీలోనే ఉనికిని కూడా కోల్పోతుంది. గత ఎన్నికల్లో 23 సీట్లుకే పరిమితం అవ్వడంతో ఆ పార్టీ కి ఏపీలో ఎంత సీన్ ఉందో? కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్ డీఏకి అర్ధమైంది. చంద్రబాబు కుతంత్ర రాజకీయాల గురించి ప్రధాని మోదీకి బాగా తెలుసు. తెలంగాణలో ఇరు పార్టీలు కలిసి పోటీ చేసినా డిపాజిట్లు కూడా రాలేదు. మళ్లీ ఇప్పుడు కొత్తగా బీజేపీతో కవ్వింపుకు పాల్పడటం వెనుక కుతంత్రం ఏమిటో వాళ్లకే తెలియాలంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పడుతున్నాయి.