Charan and NTR : తగ్గేదే లె.. చరణ్ – ఎన్టీఆర్‌ కాంబినేషన్ ఇంకోస్సారి.!

Charan and NTR :  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీయార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అంచనాలను మించిపోయి రెస్పాన్స్ అందుకుంటోంది. హేమా హేమీలు, నట దిగ్గజాలు సైతం ఈ సినిమాపై పొగడ్తల వర్షం కురిపించకుండా వుండలేకపోతున్నారు.

కానీ, వెర్రి అభిమానులు మాత్రం లోపాలు వెతికే క్రమంలో ఎప్పటిలాగే బిజీగా వున్నారు. నిజానికి నిజమైన అభిమానులు ఎప్పుడూ అలా చేయరు. కానీ, కొందరు దురభిమానులుంటారు. అలాంటి వాళ్లు ఎప్పుడూ నెగిటివిటీ ప్రచారం వైపు ఆసక్తి చూపుతుంటారు.

కాగా, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో చరణ్‌కి ఎక్కువ స్కోప్ ఇచ్చి, తారక్‌ని తగ్గించేశారంటూ వాదిస్తున్నారు ఓ వర్గం అభిమానులు. అయితే, చాలా మంది చరణ్ కంటే ఎన్టీయార్ పాత్రకే ఎక్కువ వెయిట్ వుందంటూ చెప్పుకుంటున్నారు.

అది వినిపించుకోని దురభిమానుల సంఘం అర్జెంటుగా ఈ కాంబినేషన్‌లో ఇంకో సినిమా చేయాలి జక్కన్న. ఈ సారి చేయబోయే సినిమాలో తారక్‌ని తగ్గిస్తే ఊరుకునేదే లేదంటూ రాజమౌళిపై దుష్ర్పచారం మొదలెట్టారట. మూర్ఖత్వం కాకపోతే, ఇందులో ఏమైనా అర్ధం పర్ధముందా.?

మళ్లీ ఈ కాంబినేషన్ సెట్ అయితే బాగుంగు అని ఆశించడం వేరు. అర్జెంటుగా కాంబినేషన్ సెట్ చేసి, సినిమా తీసేయమంటే, ఇదేమైనా అరటిపండు ఒలిచి, పండు తిని తొక్క పారేయడమనుకుంటున్నారా.? అంటూ మేధావులు, సినీ విశ్లేషకులు సెలవిస్తున్నారు.