Nagarjuna : ‘రాధేశ్యామ్’ బరిలో వున్నాగానీ, ‘బంగార్రాజు’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి వుండేదా.? అసలు, ‘బంగార్రాజు’ సంక్రాంతి బరిలో వుంటుందనే ప్రకటన వచ్చిందే అప్పటికప్పుడు. మరెలా, సంక్రాంతిని టార్గెట్‌గా అక్కినేని నాగార్జున అండ్ టీమ్ పెట్టుకుని వున్నట్టు.?
ఏమోగానీ, ఈ సంక్రాంతికి పెద్ద సినిమాల్లేవు.. అని ఆవేదన చెందుతున్న సగటు సినీ ప్రేక్షకుడికి కాస్త ఊరట దక్కింది నాగార్జున నటించిన ‘బంగార్రాజు’ సినిమా ద్వారా. అయితే, అప్పుడే సంబరపడటానికి వీల్లేదు. ఎందుకంటే, దేశంలో కొత్తగా నమోదవుతున్న కోవిడ్ కేసుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. తాజాగా లక్షకు చేరువయ్యింది రోజువారీ కేసుల సంఖ్య.
ఏ క్షణాన అయినా దేశంలో లాక్ డౌన్ లేదా లాక్ డౌన్ తరహా నిబంధనలు అమల్లోకి రావొచ్చు కోవిడ్ కట్టడిలో భాగంగా. ఈ పరిస్థితిని ముందే ఊహించి ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ బరిలోంచి తప్పుకున్నాయి. నిజానికి, కేసుల తీవ్రత వేగంగా పెరుగుతున్న దరిమిలా, ‘బంగార్రాజు’ కూడా రిస్క్ చేసి వుండకూడదు.
ప్రమోషనల్ ఈవెంట్స్ పేరుతో ఏ చిన్న గేదరింగ్‌కి అవకాశమిచ్చినా, కరోనా వ్యాప్తికి ఊతమిచ్చినట్లే అవుతుందన్న చిన్నపాటి లాజిక్కుని నాగార్జున ఎలా మిస్ అయ్యాడో ఏమో. అన్నట్టు, సినిమా వేదికపై రాజకీయాలు మాట్లాడకూడదు, మాట్లాడను.. అంటూ చాలామందిని హర్ట్ చేశాడు నాగార్జున.
సినిమాకి ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ఆ ఇబ్బందుల్ని ప్రస్తావించడం రాజకీయమెలా అవుతుందో నాగార్జునకే తెలియాలి. ఈ సేఫ్ గేమ్, ‘బంగార్రాజు’కి మైలేజ్ తెస్తుందని నాగ్ తెలివిగా ప్లాన్ చేశాడా.? ఏమోగానీ, బిగ్ బాస్ విషయంలోనూ ఎదుర్కోనంత విపరీతమైన ట్రోలింగ్ ఇప్పుడు ఎదుర్కోవాల్సి వస్తోంది ‘బంగార్రాజు’కి.
