Sapota Side Effects: ఈవ్యాధులతో బాధపడేవారు సపోటా పండ్లకు దూరంగా ఉండటం మంచిది..!

Sapota Side Effects:: సపోటా పండ్లు తినడానికి ఎంతో రుచిగా, తియ్యగా ఉంటాయి. వీటిని ఇష్టపడని వాళ్ళు దాదాపుగా ఉండరు. నిజానికి ఇవి స్పెయిన్ కి చెందినవి. మధ్య అమెరికాలో ఈ చెట్లు ఎక్కువ. ఇప్పుడు సపోటాలు భారతదేశంలో అందరికీ ఇష్టమైన పండుగా వెలుగొందుతోంది. ఈ చెట్ల పెంపకానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఇవి ఎక్కడ వేసిన ఈజీ గా పెరుగుతాయి, వాటంతటవి పండ్లను ఉత్పత్తి చేస్తాయి. వీటి యొక్క గింజలను తీసేసి సలాడ్లు, ఫ్రూట్ జ్యూస్, మిల్క్ షేక్ లు చేసుకొని తాగుతారు, ఇవి ఎంతో రుచికరంగా ఉంటాయి.

అన్ని పండ్లలాగే సపోటా పండులో కూడా మన ఆరోగ్యానికి అవసరమైన అనేక రకాల పోషకాలు ఉంటాయి.సపోటా పండ్లలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని నొప్పి, వాపుల నుండి ఉపశమనం కల్పిస్తుంది. సపోటాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని ఎటు వంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. కంటికి సంబంధించిన వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. శరీరంలో అలసట, నిస్సత్తువ వంటి సమస్యలను దూరం చేస్తుంది.అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సపోటా పనులకు దూరంగా ఉండటం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

సపోటాలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వీటిని కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తినకపోవడమే మంచిది. ఈ మధ్యకాలంలో పిల్లలతో శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటారు.శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నపిల్లలకు సపోటా పండు తినిపించడం వల్ల వారి సమస్యలు అధికమయ్యే అవకాశం ఉంటుంది. మధుమేహ సమస్యలతో బాధపడేవారు సపోటాలను తక్కువగా తినాలి లేదా తినకపోవడమే మంచిది. వీటిలో ఉండే తియ్యటి పరిమాణం వల్ల ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. సాధారణ వ్యక్తులు కూడా రోజుకు రెండు సపోటాలు మాత్రమే తీసుకోవాలి. వీటిని అధిక మోతాదులో తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు సపోటాలకు దూరంగా ఉండటం మంచిది.