ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ చేస్తోన్న విలయతాండవం గురించి చెప్పాల్సిన పనిలేదు. గత మూడు నెలలుగా భారత్ లోనూ అదే పరిస్థితి. ఇప్పుడిప్పుడే మహమ్మారి భారత్ లో మరింతగా విజృంభిస్తోంది. మూడు దశల లాక్ డౌన్ పూర్తి చేసుకుని నాల్గవ దశ లాక్ డౌన్ ముగింపు దశలో ఉంది దేశం. దేశంలో ఇంకొన్ని రాష్ర్టాలు కేంద్రం ఇచ్చిన సడలింపులతో పనిలేకుండా ప్రత్యేకంగా లాక్ డౌన్ ని అమలు చేస్తున్నాయి. ఇక ఏపీ లో చాలా వరకూ మినహాంపులిచ్చేసారు. రాత్రిపూట మాత్రమే కర్ఫ్యూ కొనసాగుతుంది. ప్రజల అవసరాలు, రాష్ర్టం పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ఇక్కడ సడలింపులు ఇవ్వడం జరిగిందన్నది అందరికీ తెలిసిందే.
అయితే నేడు టీడీపీ మహానాడు సభలో ఆ పార్టీ అధినేత కరోనా గురించి ఏమన్నారో తెలిస్తే షాక్ అయ్యి నేల మీద పడి గిలగిలా కొట్టుకోవాల్సిందే!! ఎందుకంటే బాబుగారు అంతలా కరోనా గురించి మాట్లాడారు మరి… ఇంతకీ ఆయనగారేమన్నారంటే? రాష్ర్టంలో కరోనా వైరస్ వ్యాప్తిపై సీఎం జగన్ దృష్టి పెట్టలేదంట. కొన్ని రాష్ర్టాలు పూర్తిగా వైరస్ ని కట్టడి చేయగలిగాయి గానీ ఏపీ మాత్రం పూర్తిగా ఫెయిలైందని విమర్శించారు. కరోనా గురించి తాను చె్ప్పింది జగన్ చేయలేదని అలా చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేదికాదన్నారు. అలా చేయకపోగా తనని బాగా ఎగతాళి చేసారని అన్నారు.
అదే చంద్రబాబు నాయుడు సీఎం అయితే గనుక కరోనా వైరస్ ని కట్టడి చేయడంలో వందశాంతం సక్సెస్ అయ్యేవాళ్లమని, ఇప్పటికీ పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చేవి అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ అసలు వైరస్ రాష్ర్టంలోకి రాకుండానే తగిన చర్యలు తీసుకునే వాళ్లమని…తమ దగ్గర ఉన్న ఐడియాలే బాగానే పనిచేసేవని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. మొత్తానికి తొలిరోజు మహానాడు కార్యక్రమం ప్రభుత్వం పై విమర్శలు…కరోనా పై సిల్లీ వ్యాఖ్యలతో బాబు అండ్ కో ముగించింది. అన్నట్లు కరోనా వైరస్ 2021 వరకూ పోదు అని డబ్లూ హెచ్ ఓ తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే.