Sleeping: ఉదయం ఆలస్యంగా నిద్రలేచే యువతకు హెచ్చరిక… ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు..!

Sleeping: ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు , పని ఒత్తిడి వల్ల చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా సగటు మనిషి జీవితంలో రోజుకు ఎనిమిది గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి. శారీరక , మానసిక ఆరోగ్యం కాపాడటంలో ఆహారంతో పాటు నిద్ర కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది.

ముఖ్యంగా యువత లేట్ నైట్ పార్టీలు , సెల్ ఫోన్స్ , వీడియో గేమ్స్ వంటి వాటితో సమయాన్ని వృధా చేస్తూ రాత్రిపూట సమయానికి నిద్రపోకపోవటం వల్ల ఉదయం ఎర్లీగా లేవలేక పోతున్నారు. ఉదయం పూట ఎక్కువ సేపు పడుకోవడం వల్ల యువతలో అనారోగ్య సమస్యలు మొదలవుతున్నాయని బ్రిఘం యంగ్ యూనివర్శిటీ ఆఫ్ అమెరికా కొత్త అధ్యయనం పేర్కొంది. టీనేజర్స్ తక్కువ నిద్ర పోవడం వల్ల వారిలో ఆకలిని పుట్టించే హార్మోన్ గ్రెలిన్ ఎక్కువగా విడుదలయ్యి ఆకలి ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది.

యువకులు ఎక్కువగా అలసి పోయినప్పుడు తక్షణ శక్తి కోసం స్వీట్ తినటానికి ప్రాధాన్యతను ఇస్తారు . ఇలా సగటున రోజుకు 12 గ్రాములు చక్కెర ఎక్కువగా తీసుకుంటారు, ఇలా సంవత్సరానికి దాదాపు మూడు కిలోల చక్కెర అదనంగా తీసుకుంటారు. ఈ అధ్యయనాన్ని 14 నుండి 17 సంవత్సరాల వయసు గల యువత మీద జరిపారు. ఎంత మోతాదులో తింటున్నమో ముఖ్యం కాదు, అందులో ఎన్ని కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ఎంత శక్తి వస్తుంది అనే అవగాహన ఉండాలి అని స్లీప్’ జర్నల్‌ ప్రధాన రచయిత డాక్టర్ కారా డురాసియో వెల్లడించారు.

చక్కెర పదార్థాలను ఎక్కువగా తీసుకోవటం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకు పోతుంది . దీని కారణంగా శరీర బరువు పెరుగుతుంది. ఫలితంగా గుండె పోటు, హై బిపి, డయాబెటిస్, స్ట్రోక్స్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. 9 నుండి 11 గంటలు నిద్రపోయే వారిలో దాదాపు 38 శాతం గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. యువతలో బరువు పెరగటం పెద్ద సమస్యగా మారింది. టీనేజర్స్ మీరు మీ ఆరోగ్యం బాగా ఉండాలి అనుకుంటే తగినంత నిద్రతో పాటుగా భోజనం లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, స్థాయిలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్స్ వీలైనంత తగ్గించాలి.