మన జీవితంలో నిద్ర అనేది ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. రోజంతా శరీరం, మెదడు శ్రమించిన తర్వాత మంచి నిద్రపోవడం ద్వారా శరీరం తిరిగి శక్తిని పొందుతుంది. కానీ ఒక చిన్న విషయం మనం చాలా సార్లు పట్టించుకోం.. ఏ దిశలో నిద్రపోవాలి? పెద్దలు ఎప్పుడూ హెచ్చరిస్తుంటారు.. తలను ఉత్తరం వైపు పెట్టి పడుకోకు, దరిద్రం అని. కానీ ఈ మాటల వెనుక ఉన్న సైన్స్ మనలో చాలా మందికి తెలియదు.
భూమి స్వయంగా ఒక అయస్కాంత శక్తిగా ఉంటుంది. దీనికి ఉత్తరం-దక్షిణం ధ్రువాలు ఉంటాయి. మన శరీరంలో కూడా స్వల్పమైన అయస్కాంత క్షేత్రం ఉంటుంది. శరీరం తలను ఉత్తరం వైపు పెట్టి పడుకుంటే, భూమి అయస్కాంత ప్రవాహం మరియు మన శరీర ఫీల్డ్ ఒకదానితో ఒకటి వ్యతిరేక దిశల్లో ఉంటాయి. దీని వల్ల రక్తప్రసరణ సరిగా జరగకపోవడం, మెదడుపై ఒత్తిడి పెరగడం, తలనొప్పులు రావడం వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇక తలను దక్షిణ దిశ వైపు పెట్టి పడుకోవడం మాత్రం పూర్తిగా భిన్నం. ఈ దిశలో పడుకుంటే శరీరంలో పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. భూమి అయస్కాంత శక్తితో మన శరీరం సమతుల్యంగా ఉంటుంది. దీని ఫలితంగా హృదయ స్పందన నార్మల్‌గా ఉండి, రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గి, డీప్ స్లీప్ సులభంగా వస్తుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం కూడా దక్షిణ దిశ వైపు నిద్రించడం స్థిరత్వానికి, దీర్ఘాయుష్షుకు సంకేతం. ఉత్తరం వైపు పడుకుంటే శరీర శక్తులు గందరగోళానికి గురై అలసట, ఆందోళన పెరుగుతుందని చెబుతుంది. ఆయుర్వేద వైద్యులు కూడా ఇదే మాటను మద్దతు ఇస్తూ, దక్షిణ దిశ వైపున నిద్రించడం నాడీ వ్యవస్థ స్థిరీకరణకు సహకరిస్తుందని చెబుతున్నారు.
ఇక, మోడర్న్ సైన్స్ కూడా ఈ వాస్తవాన్ని తిరస్కరించలేదు. భూమి అయస్కాంత క్షేత్రాలు మన నిద్ర ప్యాటర్న్, హార్మోనల్ బ్యాలెన్స్, హార్ట్ ఫంక్షనింగ్‌పై ప్రభావం చూపుతాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. శరీరం దిశ తప్పుగా ఉండితే ‘బాడీ క్లాక్’ స్వల్పంగా డిస్ట్రబ్ అవుతుందని కూడా పరిశోధనలు వెల్లడించాయి. ఆధ్యాత్మికంగా కూడా దక్షిణ దిశ వైపు పడుకోవడం మనసును శాంతింపజేస్తుందని, భూమితో గాఢమైన కనెక్షన్ ఏర్పరుస్తుందని అంటారు. ఈ దిశలో నిద్రించడం వల్ల మనసుకు ప్రశాంతత, ఆలోచనల్లో స్పష్టత, బలమైన ఎమోషనల్ స్టెబిలిటీ ఏర్పడుతుందట.
అందుకే, ఇకపై తలను ఎటు పెట్టి నిద్రపోతున్నామో గుర్తుంచుకోవాలి. ఒక చిన్న మార్పు మన ఆరోగ్యాన్ని, మనసును, నిద్ర నాణ్యతను పూర్తిగా మార్చేస్తుంది. దక్షిణ దిశ వైపు తల పెట్టి నిద్రపోవడం.. ఇది కేవలం వాస్తు కాదు, ఇది మన శరీరానికి సహజమైన సైన్స్.
