Vitamine D Side Effects: శరీరంలో విటమిన్ డి శాతం ఎక్కువైతే కలిగే నష్టాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Vitamine D Side Effects:కరోనా భయంతో చాలామంది అవసరం ఉన్నా లేకపోయినా టాబ్లెట్స్ ఎక్కువగా వాడుతున్నారు. విటమిన్ డి కరోనా కట్టడిలో బాగా ఉపయోగపడుతుందని అధ్యయనాలు తెలిపాయి. డాక్టర్లు కూడా కరోనా కట్టడి లో విటమిన్-డి కీలక పాత్ర పోషిస్తుందని తెలియజేశారు. దీంతో చాలామంది విటమిన్ డి సహజంగా కాకుండా టాబ్లెట్స్ రూపంలో తీసుకుంటున్నారు. విటమిన్ డి అనేది సూర్యరశ్మి వల్ల శరీరానికి అందుతుంది. అందుకే విటమిన్ డి ని సన్ షైన్ విటమిన్ గా కూడా పిలుస్తారు. ఏవైనా టాబ్లెట్స్ అధికంగా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఈ విటమిన్ టాబ్లెట్స్ కూడా మోతాదుకు మించి తీసుకోవడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్లు, శరీరం ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి. కింద సూచించిన సైడ్ ఎఫెక్టులు గనుక మీకు ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది.

శరీరంలో విటమిన్-డి స్థాయి పెరగడానికి సూర్య రష్మి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది సహజ మార్గం. ఈ విధంగా కాకుండా పోషకాహారాలు తినడం, సంప్లిమెంట్లను తినడం ద్వారా కూడా విటమిన్ డి పొందవచ్చును. మీకు కనుక అలసట, కండరాల నొప్పులు, తిమ్మిర్లు, బలహీనత, ఎముకల నొప్పి వంటివి కనుక ఉన్నట్టయితే మీ శరీరంలో విటమిన్-డి స్థాయి తక్కువ అయినట్టు గుర్తించవచ్చు. విటమిన్ డి అనేది చాలా తక్కువ శాతం ఆహార పదార్థాల వల్ల శరీరానికి అందుతుంది. వర్షాకాలం, శీతాకాలం సమయాలలో సూర్యరశ్మి తక్కువ వచ్చినప్పుడు శరీరంలో విటమిన్ డి లోపం కలుగవచ్చును.

సూర్య రష్మి ద్వారా వచ్చే విటమిన్ డి వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. సప్లిమెంట్ల ద్వారా విటమిన్ డి ని తీసుకున్నవారిలో ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. విటమిన్ డి ని సప్లిమెంట్ల ద్వారా ఎక్కువ తీసుకున్నట్లయితే టాక్సిసిటీ, హైపర్విటమినోసిస్ డి, హైపర్‌కాల్సెమియా అనే వాటి బారిన పడే అవకాశం ఉంటుంది. హైపర్‌కాల్సెమియా అనేది శరీరంలో విటమిన్ డి అధికం అవడం వల్ల వచ్చే వ్యాధి. అంటే ఇది రక్తంలో కాల్షియం స్థాయిని పెంచుతుంది. ఫలితంగా వాంతులు-విరేచనాలు బలహీనత, తరచూ మూత్ర విసర్జన, ఇంకా జీర్ణాశయ సమస్యలు వస్తాయి.

రక్తంలో కాల్షియం స్థాయి పెరిగి అది హార్మోన్లతో కలిసి కీళ్ల నొప్పులు, ఎముకల బలహీనత, ఎముకల గాయాలు పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల కిడ్నీ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి సమస్యలు మీకు ఉన్నట్లయితే వెంటనే విటమిన్-డి సప్లిమెంట్ తీసుకోవటం తగ్గించి డాక్టర్ని సంప్రదించడం మంచిది.