Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 59 ఏళ్ల వయసు వచ్చినా కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలాగే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్నారు. అయితే ఇప్పటికే గతంలో చాలా సార్లు ఆయన పెళ్లి వార్తలు ప్రేమ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు వాటిని స్కిప్ చేస్తూ వచ్చారు. ఇకపోతే గత కొంత కాలంగా సల్మాన్ ఖాన్ అనారోగ్య సమస్యల గురించి అనేక రకాల వార్తల వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే చాలాసార్లు అనారోగ్య సమస్యల గురించి వార్తలు వినిపించినప్పటికీ ఎప్పుడూ స్పందించలేదు.
కానీ మొట్ట మొదటిసారి సల్మాన్ ఖాన్ తన ఆరోగ్య సమస్యల గురించి స్పందించారు. ఈ సందర్బంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. నేను ఏవీ మాల్ఫోర్మేషన్,బ్రెయిన్ ఎన్యోరిజమ్ సమస్యతో ఇబ్బందిపడుతున్నట్లు తెలిపారు. ఒక నటుడిగా ఈ రంగంలో రాణించాలంటే మనమెంతో కష్టపడాల్సి ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్ లు చేస్తున్నప్పుడు తరచూ గాయాలు అవుతుంటాయి. ట్రైజెమినల్ న్యూరల్జియా, ఏవీ మాల్ఫోర్మేషన్,, బ్రెయిన్ ఎన్యోరిజమ్ ఉన్నప్పటికీ నేను వర్క్ కొనసాగిస్తున్నాను. ఎన్ని ఇబ్బందులు ఉన్నా వృత్తిపరంగా కాస్త విరామం తీసుకోవాలనే ఉద్దేశం మాత్రం నాకు లేదు. వీటితోనే జీవితాన్ని కొనసాగిస్తున్నాను.
చిన్నతనం నుంచే ఇలాంటి సమస్యలు ఉంటే ఇప్పటికే దానిని అధిగమించేవాడిని. ఇప్పుడు వీటిని అధిగమించేందుకు నన్ను నేను రీస్టార్ట్ చేసుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు సల్మాన్ ఖాన్. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సల్మాన్ ఖాన్ అనారోగ్య సమస్యల గురించి తెలిసిన అభిమానులు ఇన్ని సమస్యలు ఉన్నా కూడా పైకి నవ్వుతూ సినిమాలలో నటిస్తున్నారు అంటే రియల్లీ చాలా గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.