Kalpika Ganesh: నా కుమార్తెకు పిచ్చి పట్టింది.. పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి తండ్రి!

Kalpika Ganesh: కల్పిక గణేషన్ పరిచయం అవసరం లేని పేరు ఈమె సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ సందడి చేశారు అయితే కల్పిక సినిమాలలో నటించి సందడి చేయడం కంటే కూడా వివాదాల ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తూ అందరికీ సుపరిచితమయ్యారు. ఈమె ఎక్కడికి వెళ్లిన అందరితో గొడవలు పడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల రిసార్ట్ లో తనకు సిగరెట్లు కావాలి అంటూ రిసార్ట్ యాజమాన్యం పై బూతులు తిడుతూ గొడవ పడిన సంగతి తెలిసిందే.

ఇక ఈ ఘటన కంటే కూడా ఈమె ముందుగా ప్రిజం పబ్ యాజమాన్యంపై దాడి చేయడంతో గతంలో కూడా వార్తలలో నిలిచారు. ఇలా ఈమె పై ఇప్పటికే ఎన్నో కేసులు నమోదు అయ్యాయి. ఇలా నిత్యం వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తున్న కల్పికపై తన తండ్రి గణేష్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈయన పోలీసులను ఆశ్రయించి తన కుమార్తెకు పిచ్చి పట్టింది అంటూ పోలీసులకు తెలియజేశారు. గత కొంతకాలంగా తన కుమార్తె మానసిక వ్యాధితో బాధపడుతుందని తెలియజేశారు.

డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని మందులు కూడా వాడారని తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా మందులను వాడటం మానేయటం వల్లే తాను అందరితో గొడవలు పడుతూ వివాదాన్ని సృష్టిస్తుందని గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తన కుమార్తె తన అనారోగ్య సమస్యల కారణంగా రెండుసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేసిందని ఈయన పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు.

తన కుమార్తె కారణంగా కుటుంబ సభ్యులకి కూడా ప్రమాదం ఉందని పోలీసుల ఫిర్యాదులో తన తండ్రి గణేష్ పేర్కొన్నారు. ప్రస్తుతం కల్పిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇక ఈ విషయంపై పలువురు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు ఈమె ఇలా మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తరుణంలోనే అందరితో గొడవపడుతుంది కాబోలు అంటూ ఈ విషయంపై చర్చలు జరుపుతూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు తన తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు గురించి కల్పిక ఎక్కడ కూడా ప్రస్తావించలేదు.