Kota Srinivasa Rao: గుర్తుపట్టలేని స్థితిలో కోటా శ్రీనివాసరావు.. కాళ్లకు గాయాలు, బ్యాండేజీతో అలా!

Kota Srinivasa Rao: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో కొన్ని వందల సినిమాలలో నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా విలన్ గా నటించి భారీగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఒకప్పుడు అద్భుతమైన కామెడీ చేస్తూ పేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. మొన్నటి వరకు సినిమాల్లో నటించిన ఆయన ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

అందుకు గల కారణం ఆయన ఆరోగ్య పరిస్థితులు బాగా లేకపోవడం. వయసు మీద పడటంతో కనీసం నడవలేని స్థితిలో ఆయన ఉన్నారు. ఆయన చివరిగా రెండేళ్ల ముందు వరకు సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. 2023 లో వచ్చిన సువర్ణ సుందరి అనే సినిమాలో చివరిగా కనిపించారు. ఆ తర్వాత మరే సినిమాలో నటించలేదు కోటా శ్రీనివాసరావు. ఇది ఇలా ఉంటే తాజాగా కోటా శ్రీనివాసరావు గారిని నిర్మాత నటుడు బండ్ల గణేష్ కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఈ విధంగా రాసుకొచ్చారు.

కోటా శ్రీనివాసరావు గారితో ఈరోజు.. కోటా బాబాయ్‌ ని కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది అని బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. అయితే ఈ ఫొటో లోని కోటా శ్రీనివాసరావు పరిస్థితి చూసి తెలుగు సినీ ప్రేక్షకులు కంగారు పడుతున్నారు. సడన్ గా చూస్తే గుర్తుపట్టలేని విధంగా చాలా దారుణమైన స్థితిలో కనిపించారు కోటా శ్రీనివాసరావు. ఆయన గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. పాదాలకు దెబ్బలతో కట్లతో కనిపించారు. దీంతో ఏంటి కోటా శ్రీనివాసరావు గారు ఇలా మారిపోయారు ఆయన పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయనను ఆ పరిస్థితిలో చూసి అభిమానులు బాధను వ్యక్తం చేస్తున్నారు.