పెళ్లిచూపులు సినిమా ద్వారా హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే అంతకుముందు కొన్ని సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించిన విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు సినిమా ద్వారా హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇలా విజయ్ హీరోగా నటించిన మొదటి సినిమా సూపర్ హిట్ అవటంతో హీరోగా వరుస అవకాశాలు అందుకున్నాడు. ఆ తర్వాత విజయ్ నటించిన అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా వంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన లైగర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇదిలా ఉండగా బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత అయిన కరణ్ జోహార్ ఇటీవల విజయ్ దేవరకొండ మీద ప్రశంసలకు కురిపించాడు. బాలీవుడ్ లో ప్రసారం అవుతున్న కాఫీ విత్ కరణ్ అనే రియాలిటీ షోలో హోస్ట్ గా వ్యవహరిస్తున్న కరణ్ జోహార్ ఇటీవల విజయ్ దేవరకొండ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న కాఫీ విత్ కరణ్ అనే రియాలిటీ షో ప్రస్తుతం ఏడవ సీజన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది. ఈ షోలో విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ.. విజయ్ చాలా కూల్ గా ఉంటారని, సినిమా ప్లాప్ అయినా కూడా నిరాశ పడకుండా జయాపజయాలను ఒకేలా స్వీకరిస్తాడు. విజయ్ ఎంతో నిజాయతీగా పనిచేస్తాడని కరణ్ చెప్పుకొచ్చాడు. సెట్ లో కూడా విజయ్ ఎలాంటి ఒత్తిడి లేకుండా అందరితో సరదాగా ఉంటాడని ఈ సంధర్భంగా కరణ్ జోహార్ వెల్లడించాడు .
అయితే ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న కాఫీ విత్ కరణ్ అనే రియాల్టీ షోలో తొందర్లోనే విజయ్ కూడా పాల్గొననున్నాడు. ఇప్పటికే సమంత ఈ షోలో పాల్గొని ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. మొదట బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యే ఈ షోలో ప్రస్తుతం టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ షో కి హాజరవుతున్నారు. ఇదిలా ఉండగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషలలో విడుదల కానుంది. ఈ సినిమాకు కరణ్ జోహార్ కూడా సహనిర్మాతగా వ్యవహరించాడు.