సినిమానే నా మొదటి భార్య.. మూడు పెళ్లిళ్ల పై స్పందించిన నటుడు నరేష్?

విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటుడు నరేష్ కెరియర్ మొదట్లో హీరోగా పలు సినిమాలలో నటించిన, అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించి మెప్పించారు. ప్రస్తుతం నరేష్ యంగ్ హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇలా ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా గుర్తింపు పొందిన నరేష్ ఏదో ఒక విషయం ద్వారా సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఈయన పెళ్లిళ్ల గురించి పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి.

ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ తిరిగి నాలుగో పెళ్లికి సిద్ధమయ్యారని నటి పవిత్ర లోకేష్ తో ఈయన నాలుగో పెళ్లికి సిద్ధమయ్యారనే వార్తలు బలంగా వినపడుతున్నాయి.ఇకపోతే ఈయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ ముగ్గురికి విడాకులు ఎందుకిచ్చారనే విషయం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇలాంటి సమస్యలు ఉంటాయి అయితే మేము సినిమా వాళ్ళం కాబట్టి మా విషయాలు అందరికీ తెలుస్తాయి. ఇతరుల విషయాలు బయటకు తెలియవు అంతే తేడా అని సమాధానం చెప్పారు.

ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక నటుడిగా వృత్తిపరమైన జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అది అర్థం చేసుకున్న వారే అర్ధాంగిగా ఉంటారు లేదా ఉండరని సమాధానం చెప్పారు. గతంలో నేను నెలకు ఇరవై ఎనిమిది రోజులు పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఇలా వ్యక్తిగత జీవితం కన్నా వృత్తిపరమైన జీవితానికి అధిక ప్రాధాన్యత ఇస్తాను. అందుకే మూడు పెళ్లిళ్లు ఫెయిల్ అయ్యాయని ఆయన తెలిపారు.ఈ సినిమానే నా మొదటి భార్య సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని నరేష్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.