ఓటిటి : “రామారావు ఆన్ డ్యూటీ” స్ట్రీమింగ్ ఈ ప్రముఖ ప్లాట్ ఫామ్ లో.!

Ramarao on Duty

తాజాగా టాలీవుడ్ సినిమా దగ్గర మంచి అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి సిద్ధం అయ్యి వచ్చిన అవైటెడ్ చిత్రం “రామారావు ఆన్ డ్యూటీ” కూడా ఒకటి. మాస్ మహారాజ రవితేజ అలాగే నటుడు వేణు తొట్టెంపూడి అలాగే హీరోయిన్ మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ మరియు రజిష విజయన్ లు హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రం ఈరోజే మంచి అంచనాలు నడుమ రిలీజ్ అయ్యింది.

అయితే సినిమా టాక్ పక్కన పెడితే ఈ చిత్రం విజయం ఇప్పుడు తెలుగు సినిమా దగ్గర చాలా కీలకంగా మారింది. ఇక ఈ చిత్రానికి దర్శకుడు శరత్ మండవ వర్క్ చేయగా ఈ సినిమా రిలీజ్ తో ఈ సినిమా స్ట్రీమింగ్ పార్ట్నర్ గా ఎవరు లాక్ అయ్యారు? ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కి వస్తుందో అనేది తెలిసింది.

మరి ఈ సినిమాని కూడా రీసెంట్ గా చాలా సినిమాలు కొనేస్తున్న సోని లివ్ వారు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో డీల్ ప్రకారం 8 లేదా 10 వారాల తర్వాతే ఈ సినిమా అందులో స్ట్రీమింగ్ రానుంది. ఇక ఈ చిత్రానికి సామ్ సి ఎస్ సంగీతం అందించగా రవితేజ మరియు ఎస్ ఎల్ వి సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు.