ఆ విషయం గురించి క్లారిటీ ఇవ్వు బాబూ.. అమలు చేస్తారా? లేదా?

ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అన్ని నియోజకవర్గాల్లో ఒకే పార్టీ గెలవడం అసాధ్యం అనే సంగతి తెలిసిందే. అయితే ఏపీలో వైసీపీ మాత్రం అత్యాశకు పోతుంది. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో వైసీపీ గెలవాలని జగన్ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే జగన్ చెప్పిన విధంగా జరగడం దాదాపుగా జరగదు. అయితే ఏపీలో వైసీపీపై వ్యతిరేకత పెరుగుతున్నా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు పుంజుకోవడం లేదు.

వైసీపీ కాకుండా ఏ పార్టీని నమ్మాలనే ప్రశ్నకు సామాన్య ప్రజలు సైతం జవాబులు చెప్పలేకపోతున్నారు. వైసీపీ పాలన ఏ విధంగా ఉన్నా సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి వైసీపీ విషయంలో ప్రజలు సంతృప్తితోనే ఉన్నారు. అయితే వైసీపీ కాకుండా మరో పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను అమలు చేస్తుందా? అనే ప్రశ్న సామాన్యులను వెంటాడుతోంది. వైసీపీ కాకుండా మరే పార్టీ ఈ స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేయడం సాధ్యం కాదు.

ప్రస్తుతం ఏపీలో అమలవుతున్న పథకాలను అధికారంలోకి వస్తే రద్దు చేస్తానని చెప్పడం చంద్రబాబుకు సాధ్యం కాదు. ఈ హామీలను అమలు చేస్తే చంద్రబాబు కొత్త హామీలను ఇవ్వడం సాధ్యం కాదు. మరి చంద్రబాబు ఎన్నికల హామీల విషయంలో ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది. మరోవైపు గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదనే విమర్శ చంద్రబాబు నాయుడిపై ఉంది.

అందువల్ల చంద్రబాబు సరికొత్త హామీలను ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా అనే ప్రశ్నకు లేదనే సమాధానం వినిపిస్తోంది. జనసేన, బీజేపీ ఏపీలో పుంజుకోవడం అసాధ్యమని ప్రజలు తేల్చి చెబుతున్నారు. ఏపీ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అని ఇతర రాష్ట్రాల ప్రజల మధ్య కూడా చర్చ జరుగుతోంది. 2024 ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితాలు నమోదు కావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.